ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్‌కు తీవ్ర గాయం కావడం గమనార్హం.
2009 లో అరంగేట్రం చేసిన హ్యూస్ 26 టెస్టులు ఆడిన ఆనుభవం ఉంది. ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు ఆడిన హ్యూగ్స్ తన మొదటి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లోనే 72 పరుగులు చేశాడు. ఆ తరువాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతని బెస్ట్ స్కోరు 160 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 138.
*పూర్తి పేరు-ఫిలిప్ జోల్ హ్యూస్
*జననం- 30 నవంబర్, 1988
*మరణం-27 నవంబర్ 2014
*ముద్దు పేరు-హ్యూస్సీ
*బ్యాటింగ్ శైలి-ఎడమ చేతి వాటం
*బౌలింగ్ శైలి-కుడి చేతి వాటం
*టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, సబ్ స్టిట్యూల్ వికెట్ కీపర్
*టెస్టుల్లో ఆరంగేట్రం - దక్షిణాఫ్రికాపై (ఫిబ్రవరి 29, 2009)
*చివరి టెస్టు-ఇంగ్లండ్ పై (జూలై 18,2013)
*వన్డేల్లో ఆరంగేట్రం-శ్రీలంకపై ( జనవరి 11,2013)
*చివరి వన్డే-పాకిస్థాన్(అక్టోబర్ 12,2014)