
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) సంస్థలు దేశీయంగా తమ తమ వీశాట్ శాటిలైట్ కార్యకలాపాలను విలీనం చేయాలని నిర్ణయించుకున్నాయి. విలీన సంస్థలో హ్యూస్‌కు మెజారిటీ యాజమాన్య అధికారాలు ఉండనుండగా.. ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వాటాలు ఉంటాయని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.
బ్రాడ్‌బ్యాండ్ శాటిలైట్ నెట్‌వర్క్స్, సర్వీసుల సంస్థ హ్యూస్ నెట్‌వర్క్ సిస్టమ్స్‌కు హెచ్‌సీఐఎల్ అనుబంధ సంస్థ. ఇది దేశీయంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలకు బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్కింగ్ టెక్నాలజీలు, సర్వీసులు అందిస్తోంది. కంపెనీలకు, వ్యక్తులకు శాటిలైట్ ఆధారిత టెలికం, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీశాట్ ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment