
బిగ్ బాష్ లీగ్ 2023-24 సీజన్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్ హీట్ నిలిచింది. సిడ్నీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సిడ్నీ సిక్సర్స్‌ను 54 పరుగుల తేడాతో చిత్తు చేసిన బ్రిస్బేన్ హీట్.. రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. బ్రిస్బేన్ బౌలర్ల దాటికి కేవలం 112 పరుగులకే కుప్పకూలింది.
బ్రిస్బేన్ బౌలర్లలో ఎక్స్‌ప్రెస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన 4 ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్-2024 వేలంలో జాన్సన్‌ను రూ. 10 కోట్లకు గుజరాత్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జాన్సన్‌తో పాటు బ్రాట్‌లెట్,స్వీప్సన్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. సిడ్నీ బ్యాటర్లలో హెన్రిక్స్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ బాదిన జోష్ బ్రౌన్.. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 5 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రౌన్‌తో పాటు రెన్షా(40) పరుగులతో రాణించాడు. సిడ్నీ బౌలర్లలో అబాట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. స్టార్ క్రికెటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
Spencer 👑
— KFC Big Bash League (@BBL) January 24, 2024
Your Player of The Final. #BBL13 pic.twitter.com/saEDxVXG0q