
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025 టోర్నీలో వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు శుభారంభం చేసింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ షేన్ వాట్సన్(Shane Watson) విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన వాట్సన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కేశాడు. కేవలం 52 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 107 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డానియల్ క్రిస్టియన్(32), కట్టింగ్(18) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో యాష్లే నర్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. జెర్మీ టేలర్, రామ్‌పాల్ తలా రెండు వికెట్లు సాధించారు.
సిమ్మన్స్ ఊచకోత..
అనంతరం 217 బంతుల్లో విండీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. విండీస్ మాజీ ప్లేయర్ లెండిల్ సిమన్స్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య చేధనలో సిమన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు,8 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు డ్వేన్ స్మిత్(51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. చాడ్విక్ వాల్టన్(11 బంతుల్లో 4 ఫోర్లతో23) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ హిల్ఫెన్‌హాస్, మెక్‌గైన్, క్రిస్టియన్ తలా వికెట్ సాధించాడు. కాగా మంగళవారం ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించింది.
చదవండి: PAK vs IND: ఛాంపియన్స్ ట్రోఫీలో 'పాక్' చెత్త ప్రదర్శన.. అతడిపై వేటు..!