ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణం క్రీడాభిమానులను కలచివేసింది. ఎన్ని వివాదాలున్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌కు.. ఢిపరెంట్‌గా ఉండే హెయిర్‌స్టైల్‌కు అభిమానులు చాలా మందే ఉన్నారు. గత శనివారం రాత్రి టౌన్స్‌విల్లీలోని క్వీన్స్‌ల్యాండ్‌లో సైమండ్స్ కారు భయంకరమైన యాక్సిడెంట్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్డించారు. బ్రిస్బేన్ కొరియర్ మెయిల్ అనే పత్రిక సైమండ్స్ కారు యాక్సిడెంట్ ఫోటోలు రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు నెలల వ్యవధిలోనే ఆసీస్ క్రికెట్ ఇద్దరు ఆటగాళ్లను కోల్పోవడం క్రీడాలోకాన్ని దిగ్ర్బాంతికి గురి చేసింది.
ఇక సైమండ్స్ మృతిపై అతని సోదరి లూయిస్ విచారం వ్యక్తం చేసింది. తన సోదరుడు చనిపోయిన స్థలాన్ని సందర్శించిన లూయిస్.. ఒక ఎమోషనల్ నోట్‌ను అక్కడ ఉంచింది. ''చాలా తొందరగా వెళ్లిపోయావ్.. రెస్ట్ ఇన్ పీస్ ఆండ్రూ సైమండ్స్. నీ జీవితంలో ఒక రోజు మిగిలి ఉన్నా బాగుండేది.. ఇకపై నీ ఫోన్‌కాల్ నాకు వినపడదు. నా హృదయం ముక్కలయింది. నేను నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను బ్రదర్'' అంటూ రాసుకొచ్చింది. లూయిస్ రాసిన నోట్‌ను మియా గ్లోవర్ అనే రిపోర్టర్ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం సైమండ్స్‌కు తన సోదరి రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సైమండ్స్ పేరు తెచ్చుకున్నారు. కెరీర్‌లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్.. 133 వికెట్లు పడగొట్టాడు.2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్ వీడ్కోలు పలికాడు.
చదవండి: ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..!
ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..?
Floral tributes lay at the crash site where Andrew “Roy” Symonds lost his life on Saturday night, outside of Townsville.
— Mia Glover (@miaglover_9) May 15, 2022
The letter, penned by his sister, reads “I will always love you my brother” @TheTodayShow pic.twitter.com/Wt3EZGc6Ty
Comments
Please login to add a commentAdd a comment