
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. కాగా ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఇరు జట్లు ఆటగాళ్లు సైమండ్స్‌కు నివాళులర్పిస్తూ, గౌరవ సూచకంగా నల్ల బ్యాండ్‌లను ధరించి బరిలోకి దిగారు.
కాగా శనివారం జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ దుర్మరణం చెందాడు. సైమండ్స్ ఆకాల మరణంతో యావత్తు క్రీడాలోకం శోకసంద్రంలో మునిగి పోయింది. ఇక 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. 2003, 2007 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు.
చదవండి: Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం