IPL 2022: 'ఆ రెండు జ‌ట్లు కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి' | Parthiv Patel predicts top two teams at the end of league stage | Sakshi
Sakshi News home page

IPL 2022: 'ఆ రెండు జ‌ట్లు కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి'

Published Mon, Apr 25 2022 10:01 PM | Last Updated on Mon, Apr 25 2022 10:25 PM

Parthiv Patel predicts top two teams at the end of league stage - Sakshi

ఐపీఎల్‌-2022 సీజ‌న్ ర‌స‌వత్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టికే దాదాపు స‌గం మ్యాచ్‌లు ముగిశాయి. ఐదు సార్లు ఛాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్, డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. ఈ ఏడాది సీజ‌న్‌లో కొత్త‌గా ఏంట్రీ ఇచ్చిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు అద‌ర‌గొడుతున్నాయి. ఇది ఇలా ఉండ‌గా.. మాజీలు, క్రికెట్ నిపుణులు ఇప్ప‌టి నుంచే టైటిల్ ఫేవ‌రేట్ జ‌ట్లును అంచానా వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఆట‌గాడు పార్థివ్ పటేల్ త‌న ఫేవ‌రేట్ జ‌ట్లును ఎంచుకున్నాడు. గుజ‌రాత్ టైటాన్స్‌, ఆర్సీబీ జ‌ట్లు టైటిల్ బ‌రిలో నిలుస్తాయిని పార్థివ్ పటేల్ అభిప్రాయ‌ప‌డ్డాడు. "కొత్త జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడుతోంది. ఈ సీజ‌న్‌లో బ‌హుశా వారు పాయింట్ల ప‌ట్టిక‌లో అఖ‌రి వ‌ర‌కు నెం1 స్థానంలో కొనసాగే అవ‌కాశం ఉంది. అదే విధంగా ఆర్సీబీ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కాగా సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై ఆర్సీబీ ఘోరంగా ఆడింది. అయితే ఈ సీజ‌న్‌లో ఇదే జ‌ట్టు ఘ‌న విజ‌యాలు న‌మోదు చేసింది. ఇక  విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వ‌స్తాడ‌ని నేను ఆశిస్తున్నాను" అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.

చ‌ద‌వండి: IPL 2022: టీ20ల్లో అరుదైన ఘ‌న‌త సాధించిన శిఖ‌ర్ ధావ‌న్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement