గత శనివారం (మే 14) రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46)కు ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళి తెలిపింది. గతంలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు కూడా ప్రత్యేకంగా నివాళులర్పించిన డెయిరీ దిగ్గజం.. తాజాగా సైమండ్స్ మృతికి సంతాపంగా ఓ స్పెషల్ డూడుల్‌ను డిజైన్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
సైమండ్స్ ఆన్ ఫీల్డ్ చిత్రాలతో డిజైన్ చేసిన ఈ డూడుల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుటుంది. ఈ డూడుల్‌లో సైమండ్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. He Symmolised the game అంటూ హెడ్డింగ్‌ను జోడించారు. ఈ డూడుల్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అభిమానులు ఈ డూడుల్‌ను షేర్ చేస్తూ రాయ్ (సైమండ్స్ ముద్దు పేరు)కు నివాళి అర్పిస్తున్నారు.
1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సైమండ్స్.. తన మొత్తం కెరీర్‌లో 198 వన్డేలు, 26 టెస్ట్‌లు, 14 టీ20లు, 39 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్‌లు గెలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. 2011లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయ్ చనిపోక ముందు వరకు వ్యాఖ్యాతగా కొనసాగాడు.
చదవండి: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ
Comments
Please login to add a commentAdd a comment