క్యూట్‌గా ఉన్న చిన్న పిల్లలను చూస్తే వెంటనే అమూల్ బేబీలా ఉన్నారు అంటాం. అంతలా అమూల్ బ్రాండ్ జనాల్లోకి వెళ్లింది. గుజరాత్‌కు చెందిన కంపెనీయే అయినా తెలుగు రాష్ట్రాల్లోను దీని పాల ఉత్పత్తులకు మంచి పేరే ఉంది. ఈ కంపెనీని పాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ కంపెనీగా మార్చాలని ప్రధాని మోదీ కంపెనీ వాటాదారులను విజ్ఞప్తి చేశారు.
'అమూల్' బ్రాండ్‌ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)ని ప్రస్తుతం ఎనిమిదో స్థానం నుంచి ప్రపంచంలోనే నంబర్ వన్ డెయిరీ కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం రైతులు, సహకార సంఘాలకు సంబంధించిన ఇతర వాటాదారులకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.
జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని మోతెరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాదాపు లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సహకార సంఘాలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందన్నారు. పదేళ్లలో భారతదేశ తలసరి పాల లభ్యత 40 శాతం పెరిగిందని చెప్పారు. ప్రపంచ పాడి పరిశ్రమ 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, భారత్ వృద్ధి రేటు 6 శాతంగా ఉందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
భారత డెయిరీ రంగం మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లుగా ఉందన్నారు. వరి, గోధుమలు, చెరకు ఉత్పత్తి ఉమ్మడి టర్నోవర్ కంటే చాలా అది చాలా ఎక్కువ అన్నారు. డెయిరీ రంగంలో సేవలందిస్తున్న మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment