మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు.
కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు..
ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్‌మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.
శివాలెత్తిన మార్ష్, డేవిడ్..
216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్‌వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది.
బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్..
చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్‌లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్‌లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్‌లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment