వెల్లింగ్టన్: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన తొలి టి20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఆ్రస్టేలియాను గెలిపించాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో ఆ్రస్టేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీస్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అనంతరం ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) తక్కువే చేసినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. 17వ ఓవర్ ఆఖరి బంతికి హిట్టర్ టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు ఆసీస్ గెలిచేందుకు 19 బంతుల్లో 44 పరుగులు కావాలి. కాసేపటికే అది కాస్తా 9 బంతుల్లో 32 పరుగుల సమీకరణం కష్టంగా మారింది.
ఈ దశలో మిల్నే వేసిన 19వ ఓవర్ ఆఖరి మూడు బంతుల్ని డేవిడ్ 4, 6, 6లుగా బాదేశాడు. దాంతో చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన సౌతీ వైడ్ సహా 3 బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. ఇక మిగిలిన 3 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... డేవిడ్ 6, 2, 4లతో ఆసీస్ జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టి20 మ్యాచ్ శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment