టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లి తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందాడు. ఆసియాకప్-2022లో ఆఫ్గానిస్తాన్‌పై అద్భుతమైన సెంచరీ తర్వాత.. కోహ్లి జోరుకు బ్రేక్‌లు లేవు. సొంత గడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లలో అదరగొట్టిన కోహ్లి.. ఇప్పడు టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు.
టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం కోహ్లి దుమ్ము రేపాడు. ఓ సంచలన క్యాచ్, రనౌట్‌తో భారత విజయంలో కింగ్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ ప్రశంసల జల్లు కురింపించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లి లాంటి ఆటగాడిని మళ్లీ చూస్తానో లేదో తెలియదని పాంటింగ్ అన్నాడు.
ప్రస్తుతం పాంటింగ్ టీ20 ప్రపంచకప్-22లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ సందర్భంగా పాంటింగ్ ఈ వాఖ్యలు చేశాడు. "విరాట్ సారధిగా జట్టును విజయ ఫథంలో నడిపించాడు. నిజంగా అతడి కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం అద్భుతం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లి లాంటి ఆటగాడిని చూస్తానో లేదో ఖచ్చితంగా తెలియదు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో కోహ్లి రికార్డులు అద్భుతమైనవి" అని పాంటింగ్ పేర్కొన్నాడు.
చదవండి: BCCI New President: గంగూలీకి బైబై! బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
Comments
Please login to add a commentAdd a comment