టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో.. పాకిస్తాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి... జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అయితే.. మహ్మద్ నవాజ్ వేసిన అఖరి ఓవర్‌లో అంపైర్ ఇచ్చిన ‘నో బాల్’ పై మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. అది అసలు నోబాల్ కాదని, కోహ్లి ఒత్తిడి చేయడం వల్లే అంపైర్‌లు నో బాల్‌గా ప్రకటించారని పాక్ జట్టు అభిమానులు అంటున్నారు.
డెడ్ బాల్ వివాదం
నవాజ్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఫ్రీ హిట్ బంతికి విరాట్ కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. బంతి స్టంప్స్ తాకి బౌండరీ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో విరాట్, దినేష్ కార్తీక్ మూడు పరుగులు తీశారు. అంపైర్ ఆ మూడు పరుగులను బైస్‌గా ప్రకటించారు. అయితే ఫ్రీ హిట్ బంతి స్టంప్స్‌కి తగలడంతో దాన్ని నోబాల్‌గా ప్రకటించాలని పాక్ కెప్టెన్ బాబర్ అంపైర్‌ను కోరాడు.
అంపైర్‌లు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడి బైస్‌గానే ప్రకటించారు. ఈ క్రమంలో బాబర్‌తో పాటు పాక్ ఆటగాళ్లు అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇక డెడ్ బాల్ వివాదం సంబంధించి ఎంసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ సారి పరీశీలిద్దాం.
డెడ్ బాల్‌గా ఎప్పడు ప్రకటిస్తారంటే..
ఐసీసీ నిబంధనల ప్రకారం.. బంతి నేరుగా వికెట్ కీపర్ లేదా బౌలర్‌కు క్యాచ్ వెళ్లినా లేదా బౌండరీ దాటినప్పుడు మాత్రమే డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. అయితే ఫ్రీహిట్ బంతి స్టంప్స్‌ను తాకినప్పుడు అది డెడ్ బాల్ కాదా అనే ప్రకటించే అధికారం అంపైర్‌కు ఉంటుంది. అదే విధంగా ఫ్రీ హిట్ బంతిని ఆడే క్రమంలో బ్యాటర్ హిట్ వికెట్ అయినా దాన్ని డెడ్ బాల్‌గా పరిగణించవచ్చు.
ఫ్రీ హిట్ బంతికి అవుట్ ఎప్పుడంటే?
ఫ్రీ హిట్ బంతిని బ్యాటర్ చేత్తో పట్టుకోవడం, బంతిని రెండుసార్లు కొట్టడం, రనౌట్ చేయడం వంటివి చేస్తే అంపైర్ ఔట్‌గా పరిగణిస్తారు.
చదవండి: T20 World Cup 2022: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment