ఆసియాకప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌పై 228 టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి(122), కేఎల్ రాహుల్(111) సెంచరీలతో అదరగొట్టగా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో సత్తాచాటాడు.
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కు మించి అత్యుత్తమ ప్రదర్శన ఎవరూ చేయలేదని గంభీర్ కొనియాడాడు.
"అవును ఈ మ్యాచ్‌లో కోహ్లి, కేఎల్ రాహుల్ సెంచరీలు చేశారు. గిల్, రోహిత్ కూడా అర్ధ శతకాలు సాధించారు. కానీ నా వరకు అయితే కుల్దీప్ యాదవ్ మించిన ప్రదర్శన ఎవరూ చేయలేదు. కుల్దీప్ మరోసారి తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
అది కూడా 8 ఓవర్లనే సాధించడం అద్భుతం. మరీ ముఖ్యంగా స్పిన్‌ను బాగా ఆడే పాకిస్తాన్ బ్యాటర్లు సైతం కుల్దీప్‌ను ఎదుర్కోలేకపోవడం నన్ను ఆశ్యర్యపరిచింది. అదే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ క్రికెటర్లు మణికట్టు స్పిన్నర్లకు ఆడలేరను నాకు తెలుసు. కానీ స్పిన్‌ను అద్భుతంగా ఆడగలిగే పాకిస్తాన్‌కు ఏమైంది?
బౌలర్ క్వాలిటీ ఎటువంటిదో అక్కడే మనకు అర్ధమవుతుంది. కుల్దీప్ ఈ రిథమ్‌లో ఉండడం భారత క్రికెట్‌కు మంచి సంకేతాలు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు ముందే ప్లాన్ చేసుకున్నారు: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment