టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో మెల్‌బోర్న్ వేదికగా పాక్‌పై విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ను అఫ్రిది కొనియాడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ కోహ్లిదే అని ఈ పాక్ స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన ఆటగాడు. మాపై కోహ్లి (58 బంతుల్లో 82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
నా కెరీర్‌లోనే ఇప్పటివరకు ఇంతకంటే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను చూడలేదు. ఆ రోజు హ్యారీస్ రవూఫ్ వేసిన అద్భుతమైన బంతిని కోహ్లి బౌలర్ తలపై నుంచి కొట్టిన సిక్స్ నమ్మశక్యం కానిది" అంటూ స్టార్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు.
వన్ మ్యాన్ కింగ్ షో..
కాగా కోహ్లి కెరీర్‌లో మెల్‌బోర్న్‌లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా మిగిలుపోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు కింగ్ కోహ్లి. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా . 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో విరాట్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. హ్యారీస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్‌లో చివరి రెండు బంతులకు విరాట్ కొట్టిన సిక్స్‌లు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమంగా నిలిచిపోయాయి. ఆ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment