వరల్డ్‌క్రికెట్‌లో బిగ్గెస్ట్ రైవలరీ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత్-పాకిస్తాన్ మ్యాచే. ఈ దాయదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు.
అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ తమ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ జట్టును మిస్బా హెచ్చరించాడు.
"భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎక్స్ ఫ్యాక్టర్. అతడు ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్‌కు ఓటమిరూచిను చూపించాడు. పాకిస్తాన్‌పైన అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో చెలరేగిపోతాడు.
విరాట్ ఎప్పుడూ ఒత్తడితో ఆడినట్లు నేను చూడలేదు. విరాట్ ఒక టాప్-క్లాస్ క్రికెటర్. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది. విరాట్‌ను ఆపాలంటే ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతని స్ట్రైయిక్ రేటు పెద్ద విషయమే కాదు.
అతడు తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోడు. కోహ్లి విమర్శలను పొగడ్తలగా భావించి మరింత రాటుదేలుతాడని" స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్బా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment