టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి.. మూడో వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికీ కోహ్లి మాత్రం అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 56 పరుగులు చేశాడు.
హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటవరకు 269 ఇన్సింగ్స్‌లు ఆడిన కోహ్లి.. 113 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(112) పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌తో పాంటింగ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(145) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర(118) ఉన్నాడు. అంతేకాకుండా వన్డేల్లో నాన్ ఓపెనర్‌గా అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు చేసిన కుమార్ సంగక్కర(112) రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇప్పటివరకు నాన్ ఓపెనర్‌గా వచ్చి కోహ్లి కూడా 112 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు.
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
Comments
Please login to add a commentAdd a comment