
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం తీరుపై ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్-2025 (IPL 2025) వేలంలో సీఎస్‌కే వ్యూహాలు సరిగ్గా లేవని విమర్శించాడు. ఈసారి సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో చెన్నై ఫ్రాంఛైజీ విఫలమైందన్నాడు. కాగా ఈ సీజన్‌లో సీఎస్‌కే దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే.
పదో స్థానంలో అట్టడుగున
తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయిన ధోని సేన.. ఈ సీజన్‌లో ఏడో పరాజయం నమోదు చేసింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో అట్టడుగున ఉంది.
ఈ నేపథ్యంలో సీఎస్‌కే తీరుపై విమర్శలు వస్తుండగా.. స్టార్ స్పోర్ట్స్ షోలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘సీఎస్‌కే వైఫల్యాలకు మేనేజ్‌మెంట్‌ను తప్పుబట్టాలా? లేదంటే.. మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించాలా?’’ అన్న ప్రశ్న ఎదురైంది.
అంతిమ నిర్ణయం వారిదే
ఇందుకు బదులిస్తూ.. ‘‘వేలం సమయంలో వాళ్లు కచ్చితంగా ఎంఎస్‌కు కాల్ చేస్తారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ వేలంపాటలో భాగం కాలేదు. ఆ చర్చల్లోకే వెళ్లలేదు. అయితే, ఎంఎస్‌తో మాత్రం కచ్చితంగా చర్చిస్తారు. రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్ల గురించి మాట్లాడతారు. ఆటగాళ్ల కొనుగోలు సమయంలోనూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందని అడుగుతారు. కానీ ఎంఎస్ పూర్తిగా ఇందులో భాగంకాడు.
తనకు కావాల్సిన నలుగురు, ఐదుగురు ప్లేయర్ల గురించి మాత్రమే చెప్తాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో కోర్ గ్రూప్‌దే అంతిమ నిర్ణయం. కాశీ విశ్వనాథన్ సర్, రూపా మా అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా ఉంటారు. వారు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ధోని గనుక పూర్తిగా వేలంలో భాగమై ఉంటే.. ఇలాంటి ఆటగాళ్లను కొనేవాడు అంటారా?!’’ అని రైనా పేర్కొన్నాడు.
ధోని బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు
ఇక సీఎస్‌కే పట్ల ధోని అంకితభావం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఈసారి రంగంలోకి దిగిన ఎంఎస్ ధోనిని చూడండి. 43 ఏళ్ల వయసున్న కెప్టెన్. ఇంకా జట్టు కోసం శాయశక్తులా కష్టపడుతున్నాడు. సీఎస్‌కే బ్రాండ్, అభిమానుల కోసం ఆడుతున్నాడు.
ఈ వయసులోనూ కీపర్‌గా రాణిస్తున్నాడు. జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. జట్టు భారం మొత్తాన్ని ఒక్కడే తన భుజాలపై మోస్తున్నాడు.
మరి మిగతా పది మంది ఆటగాళ్లు ఏం చేస్తున్నారు? రూ. 18 కోట్లు, 17 కోట్లు.. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు కెప్టెన్‌కు ఎలాంటి సహకారం అందిస్తున్నారు?’’ అంటూ సురేశ్ రైనా సీఎస్‌కే ఆటగాళ్ల తీరుపై మండిపడ్డాడు. కాగా గతేడాది ధోని స్థానంలో పగ్గాలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఈ సీజన్‌లో ఐదుమ్యాచ్‌లు ఆడి గాయపడ్డాడు. ఈ క్రమంలో ధోని మరోసారి సీఎస్‌కే సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
చదవండి: ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వె ళ్లగక్కిన ధోని