Ricky Ponting Reveals About Approach For Team Indias Head Coach.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2021 జరుగుతున్న సమయంలోనే తనకు టీమిండియా హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చిందని తెలిపాడు. అయితే వర్క్‌లోడ్ దృష్యా ఆ అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్న పాంటింగ్ గ్రేడ్ క్రికెట్ పాడ్‌కాస్ట్ ఇంటర్య్వూలో మాట్లాడాడు.
చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం?
''ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్నా. సంవత్సరంలో 300 రోజులు భారత్‌లోనే గడుపుతున్నా. టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వెళ్తే .. రెండు పనులు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. కానీ అంత టైమ్ కూడా వేస్ట్ చేయలేదు. వర్క్‌లోడ్ ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో ఐపీఎల్‌లో కోచ్ పదవిని పక్కనబెట్టి టీమిండియాకు మాత్రమే పనిచేయాల్సి వస్తుంది. ఇప్పటికైతే టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేదు. అందుకే తిరస్కరించా.
కానీ రాహుల్ ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంపై ఒక్కక్షణం ఆశ్చర్యపోయా. అయితే అండర్-19 క్రికెట్‌లో కోచ్‌గా ద్రవిడ్ పాత్ర అభినందనీయం. అతను అటు ఫ్యామిలీని.. ఇటు బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలడు. ద్రవిడ్‌కు అప్పజెప్పి బీసీసీఐ మంచి పని చేసింది. రానున్న కాలంలో అతని పర్యవేక్షణలో టీమిండియా రాటుదేలడం గ్యారంటీ'' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్.. కారణం ఏంటంటే!
Comments
Please login to add a commentAdd a comment