టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. క్రమశిక్షణరాహిత్యం,ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న పృథ్వీ షా.. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడే అవకాశం కూడా కోల్పోయాడు.
ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
తన కెరీర్ ఆరంభంలో జానియర్ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షాకు ఇప్పుడు కనీసం ఫ్రాంచైజీ క్రికెట్‌లో కూడా ఆడే ఛాన్స్ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే వేలంలో అమ్ముడుపోకపోవడంతో పృథ్వీ షాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మహ్మద్ కైఫ్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం పృథ్వీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్ మాత్రం ఈ ముంబై ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.
"ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలడం నిజంగా చాలా బాధాకరం. నా కోచింగ్ కెరీర్‌లో ఇప్పటివరకు నేను పనిచేసిన టాలెంటెడ్ క్రికెటర్లలో పృథ్వీ ఒకడు. కనీసం అతడు యాక్సిలరేటర్ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అది కూడా జరగలేదు.
అయితే వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలినప్పటికీ అన్ని ఫ్రాంచైజీల కళ్లు అతడిపైనే ఉన్నాయి. అతడి నుంచి ఆటను ఎవరూ దూరంగా ఉంచలేరు. కచ్చితంగా పృథ్వీ మళ్లీ తిరిగివస్తాడని నేను భావిస్తున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.
కాగా రికీ పాటింగ్‌తో పృథ్వీషాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఆరేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేశారు. ఐపీఎల్-2018 సీజన్ నుంచి ఈ ఏడాది సీజన్ వరకు ఢిల్లీ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ పనిచేయగా.. పృథ్వీ షా ఆటగాడిగా కొనసాగాడు.
చదవండి: IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment