ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌కు ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరిగిన తీరు గురించి పాంటింగ్ మాట్లాడుతున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమానుల్లో ఒక ఆకతాయి పాంటింగ్‌వైపు ద్రాక్షా పండ్లను విసిరారు. అవి నేరుగా పాంటింగ్ షూ వద్ద పడగా.. కొన్ని అతని మొహాన్ని తాకాయి.
దీంతో అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాంటింగ్.. తనపైకి ద్రాక్ష పండ్లు విసిరిన వ్యక్తిని పట్టుకోవాలని అక్కడి సెక్యూరిటీ అధికారులకు తెలిపాడు. ''నాపై ద్రాక్ష పండ్లతో దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని కనిపెట్టాల్సిందే.. వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు'' అంటూ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలిరోజు ఆట ముగిసిన అనంతరం షో హోస్ట్ ఇయాన్ వార్డ్, రికీ పాంటింగ్‌లు స్పిన్నర్ టాడ్ మర్ఫీని ఇంటర్య్వూ చేశారు. ఇది ముగిసిన అనంతరం తొలిరోజు ఆట ఎలా జరిగిందన్న విషయాన్ని పాంటింగ్ వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా సాగింది. ఇంగ్లండ్‌ను తొలిరోజే ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ నిలకడను ప్రదర్శించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల దాటికి బ్రూక్ మినహా పెద్దగా ఎవరు రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 26, లబుషేన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 222 పరుగులు వెనుకబడి ఉంది.
Hi @piersmorgan & @TheBarmyArmy
— FIFA Womens World Cup Stan account ⚽️ (@MetalcoreMagpie) July 28, 2023
Is this within the spirit of the game?
Pelting grapes at Ponting who’s just a commentator.
I know you’ve lost the Ashes and all talk about Sour grapes pic.twitter.com/xkewu1h8v3
చదవండి: టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన ఐర్లాండ్..
Novak Djokovic: జొకోవిచ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment