
Photo Courtesy: IPL
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో సునాయస విజయాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్ విజయంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ రేపు రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
''నాకు రిషబ్ పంత్‌లో కోహ్లి, విలియమ్సన్‌లు కనిపిస్తున్నారని.. అతని దూకుడులో కోహ్లి కనిపిస్తుంటే.. కెప్టెన్సీలో విలియమ్సన్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్ రావాలనేదానిపై మాకు క్లారిటీ లేదు. కానీ అతనికి నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ బాగా అచ్చొచ్చంది. అయితే ఒక విషయంలో మాత్రం అతను మరింత రాటు దేలాల్సి ఉంది. జట్టులోకి కీపర్‌గా వచ్చిన రిషబ్ పంత్ కొన్నిసార్లు కీపింగ్‌లో అనవసర తప్పులు చేస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మంచి టచ్‌లో ఉన్న అతనికి బ్రిలియంట్ ఫుట్‌వర్క్ ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. ఎలాగు బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించే పంత్ కీపింగ్‌లోనూ మెరుగుపడితే ఇంకో 10-12 ఏళ్లు టీమిండియా తరపున లీడింగ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతాడు.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా భుజం గాయంతో ఐపీఎల్ సీజన్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో పంత్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
చదవండి: పంత్ సేనకు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు కరోనా
Comments
Please login to add a commentAdd a comment