వేణుగోపాల్ రావు, హేమంగ్ బదానీ (PC: DC X)
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.
కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్‌లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్‌డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.
ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ బ్యాటింగ్ కోచ్‌గానూ నియమితుడు కావడం గమనార్హం.
పాంటింగ్, గంగూలీకి బైబై
హెడ్‌కోచ్‌గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు.
కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.
చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment