Hemang Badani
-
దాదా స్థానంలోకి అతడు.. గంగూలీకి ‘కొత్త’ బాధ్యతలు!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), వుమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో పాటు దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ‘దాదా’ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగనున్నాడు.ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు జేఎస్‌డబ్ల్యూతో పాటు జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండగా... దక్షిణాఫ్రికా లీగ్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంతంగానే జట్టును కొనుగోలు చేసుకుంది. కాగా జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ ఆపరేషన్స్ జీఎంఆర్ పర్యవేక్షించనుండగా.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ డబ్ల్యూపీఎల్ వ్యవహారాలు చూసుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి గురువారమే మరో కీలక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్ర మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపిక చేసింది.గత సీజన్ వరకు సౌరవ్ గంగూలీ ఈ బాధ్యతలు నిర్వర్తించగా... ‘దాదా’ స్థానంలో ఇప్పుడు జట్టు యాజమాన్యం వేణుగోపాల రావును నియమించింది. ఏడేళ్లుగా ఢిల్లీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పాంటింగ్‌ను ఇటీవల తొలగించిన క్యాపిటల్స్ ... అతడి స్థానంలో భారత మాజీ ప్లేయర్ హేమంగ్ బదానీని కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తోంది.ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు జాతీయ జట్టు తరఫున 16 వన్డేలు ఆడాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో సభ్యుడైన వేణుగోపాలరావు... గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున మూడు సీజన్లు ఆడాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చాన్నాళ్లుగా కొనసాగుతున్నా. నా మీద నమ్మకంతో డైరెక్టర్ ఆప్ క్రికెట్ బాధ్యతలు అప్పగించింనందుకు ధన్యవాదాలు. కొత్త సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని వేణు పేర్కొన్నాడు.మరోవైపు 47 ఏళ్ల బదానీ జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. అతడికి కోచింగ్‌లో అపార అనుభవం ఉంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన బదానీ, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో జాఫ్నా కింగ్స్ జట్టుకు కోచ్‌గా రెండు టైటిల్స్ అందించాడు. దక్షిణాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ ఈ్రస్టెన్ కేప్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఇటీవల ఐఎల్టి20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు శిక్షకుడిగా పనిచేశాడు.‘ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా ఎంపికవడం ఆనందంగా ఉంది. నాపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజు్ఞడిని. మేగా వేలానికి ముందు కోచింగ్ బృందాన్ని సమన్వయ పరుచుకొని అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తా. క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని బదానీ అన్నాడు. ‘ఆటపై అపార అనుభవం ఉన్న బదానీ, వేణుగోపాలరావు ఢిల్లీ జట్టుతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కొత్త పాత్రలను వారు సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకముంది’అని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్‌డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ బ్యాటింగ్ కోచ్‌గానూ నియమితుడు కావడం గమనార్హం.పాంటింగ్, గంగూలీకి బైబైహెడ్కోచ్గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
'ఆర్సీబీకి వారి అవసరం చాలా ఉంది.. కనీసం వచ్చే సీజన్లోనైనా'
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు ఢిపెండ్ చేయలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టుకు భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ కీలక సూచనలు చేశాడు. ఆర్సీబీ ప్రాంఛైజీకి మెరుగైన టాలెంట్ స్కౌట్స్ అవసరమని బదానీ అన్నాడు. "ఆర్సీబీ ఫ్రాంచైజీలో సరైన టాలెంట్డ్ స్కౌట్లు లేరు. ఆర్సీబీకి మెరుగైన టాలెంట్ స్కౌటింగ్ సిస్టమ్ కూడా అవసరం. గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీ స్కౌటింగ్ విభాగంలో కాస్త గందరగోళం నెలకొంది. కాబట్టి రాబోయో సీజన్లలోనైనా ఆర్సీబీ ఫ్రాంచైజీ స్కౌటింగ్ విభాగానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని" నేను ఆశిస్తున్నానని బదార్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రతీ ఫ్రాంఛైజీలోను టాలెంట్డ్ స్కౌట్ ఉంటారు. ఐపీఎల్ వేలానికి ముందు దేశవ్యాప్తంగా క్రికెట్ టయల్స్ నిర్వహించి ప్రతిభగల యువ క్రికెటర్లను గుర్తించడమే ఈ టాలెంట్డ్ స్కౌట్లు పని. అలా గుర్తించిన ఆటగాళ్లను వేలంలో దక్కించుకోనుందుకు ఫ్రాంచైజీలకు స్కౌట్లు సిఫారస్సు చేస్తారు. -
SRH: ఏదో పొడిచేస్తాడనుకుంటే!.. అతడొక్కడేనా?! నాకు నమ్మకం ఉంది!
IPL 2023 DC Vs SRH: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ హేమంగ్ బదాని మద్దతుగా నిలిచాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగల సత్తా ఉన్న ఆటగాడంటూ కొనియాడాడు. ప్రస్తుతం తన ఆట తీరు బాగా లేకపోయినా.. త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో 13.25 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు బాదిన ఈ 24 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్‌పై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంచనాలు అందుకోలేక కానీ బ్రూక్ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయ సెంచరీతో మెరిసిన బ్రూక్.. మిగతా మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్ మొత్తంగా సాధించిన పరుగులు 163. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. ఇందులో ఓ శతకం. ఈ గణాంకాలను బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో హ్యారీ బ్రూక్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో డకౌట్ అయిన బ్రూక్‌పై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. సెంచరీతో మురిపించి రోజురోజుకూ దిగజారి పోతున్నాడంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా.. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ విజయానంతరం కోచ్ హేమంగ్ బదాని మాట్లాడుతూ తమ బ్యాటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. లోపాలు సరిచేసుకోవాల్సి ఉంది. ఒక్క ఇన్నింగ్స్ చాలు తిరిగి పుంజుకోవడానికి. కచ్చితంగా మా ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్... తను ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని బదాని పేర్కొన్నాడు. అదే విధంగా మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడని.. టచ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరితరం కాదని చెప్పుకొచ్చాడు. కాగా ఢిల్లీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. అతడొక్కడేనా! వాళ్లు కూడా ఇక బ్రూక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి(8 మ్యాచ్‌లలో 170 పరుగులు), మయాంక్ అగర్వాల్ (8 మ్యాచ్‌లలో 169 పరుగులు) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ఆడిన 5 ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో మెరిశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో కీలక సమయంలో విలువైన అజేయ అర్ధ శతకం(53) సాధించాడు. చదవండి: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా? సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
BCCI: తన గురించి వస్తున్న వార్తలను ఖండించిన మాజీ ఆల్‌రౌండర్
BCCI Selection Committee: జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నంటూ వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ స్పందించాడు. మీడియాలో తన గురించి వస్తున్న కథనాలు అవాస్తవమని కొట్టిపడేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ పానెల్లో భాగం కావడం గొప్ప గౌరవమని.. అయితే తాను మాత్రం ప్రస్తుతం ఎలాంటి పోస్టుకు అప్లై చేయలేదని స్పష్టం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లోనూ టీమిండియా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా మేజర్ ఈవెంట్లలో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త సెలక్షన్ కమిటీ నియామకం నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించేందుకు నవంబరు 28ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలో హేమంగ్ బదానీ కూడా అప్లై చేశారని, అంతేగాక సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో కూడా ఉన్నాడంటూ అతడి పేరు వార్తల్లో నిలిచింది. నేనసలు అప్లై చేయలేదు ఈ విషయంపై స్పందించిన హేమంగ్ బదానీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. మీ అందరికీ ఓ విషయంలో స్పష్టతనివ్వాలనుకుంటున్నాను. బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా ఉండటం గొప్ప గౌరవం. అయితే, మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా నేను సెలక్షన్ కమిటీ పోస్టుకు దరఖాస్తు చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ బుధవారం ట్వీట్ చేశాడు. కాగా తమిళనాడు ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ.. 2000- 2004 వరకు టీమిండియా తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా, లెగ్ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్, సలీల్ అంకోలా తదితరులు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు అప్లై చేసుకున్నారు. చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్ IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్ 🙏🏽🙏🏽 pic.twitter.com/WX2I1vXRxf — Hemang Badani (@hemangkbadani) November 30, 2022