ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది.
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు ఢిపెండ్ చేయలేకపోయారు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టుకు భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ కీలక సూచనలు చేశాడు. ఆర్సీబీ ప్రాంఛైజీకి మెరుగైన టాలెంట్ స్కౌట్స్ అవసరమని బదానీ అన్నాడు.
"ఆర్సీబీ ఫ్రాంచైజీలో సరైన టాలెంట్‌డ్ స్కౌట్‌లు లేరు. ఆర్సీబీకి మెరుగైన టాలెంట్ స్కౌటింగ్ సిస్టమ్ కూడా అవసరం. గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీ స్కౌటింగ్ విభాగంలో కాస్త గందరగోళం నెలకొంది. కాబట్టి రాబోయో సీజన్లలోనైనా ఆర్సీబీ ఫ్రాంచైజీ స్కౌటింగ్ విభాగానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని" నేను ఆశిస్తున్నానని బదార్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
కాగా ప్రతీ ఫ్రాంఛైజీలోను టాలెంట్‌డ్ స్కౌట్ ఉంటారు. ఐపీఎల్ వేలానికి ముందు దేశవ్యాప్తంగా క్రికెట్ టయల్స్ నిర్వహించి ప్రతిభగల యువ క్రికెటర్లను గుర్తించడమే ఈ టాలెంట్‌డ్ స్కౌట్‌లు పని. అలా గుర్తించిన ఆటగాళ్లను వేలంలో దక్కించుకోనుందుకు ఫ్రాంచైజీలకు స్కౌట్‌లు సిఫారస్సు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment