ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు.
అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్‌మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్ తెలిపాడు.
"మేము తొలుత బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్‌పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది.
పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్‌కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు.
A comeback to winning ways when it mattered the most & how 👌👌
Upwards & Onwards for Rajasthan Royals in #TATAIPL 2024 😄⏫
Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/NsxjVGmjZ9— IndianPremierLeague (@IPL) May 22, 2024
Comments
Please login to add a commentAdd a comment