Venugopal Rao
-
ప్రైవేట్ విద్యుత్‌తో ప్రజలపై భారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించకపోవడంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇతర మార్గాల్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు తప్పుబట్టారు. ప్రైవేటు విద్యుత్ కొనాల్సి రావడంతో తుదకు రాష్ట్ర ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. జెన్కో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జెన్కో విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులు మెరుగుపరచాలని సూచించారు. ట్రూఅప్ చార్జీలతో పాటు ఎంవైటీ పిటిషన్‌లోని వ్యయాలు అసాధారణంగా, అవాంఛనీయంగా ఉన్నాయని, ప్రజలపై భారంపడకుండా నియంత్రించాలని ఈఆర్సీని కోరారు. 2022–23కి సంబంధించి జెన్కో దాఖలు చేసిన రూ.830.61 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలతో పాటు 2024–25 నుంచి 2028–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్లపై సోమవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించింది. వేణుగోపాల్‌రావుతో పాటు పారిశ్రామిక, వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యలకు తమ సలహాలు, సూచనలు తెలియజేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి ‘తక్కువ వ్యవధిలో కీలక పిటిషన్లపై నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడిదారీ అనుకూల విధానాలు సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. విద్యుత్ సంస్థలను నియంత్రించడానికి ఈఆర్సీ తన పరిధిలోని అధికారాలను వినియోగించుకునే విషయంలో వెనుకాడరాదు..’ అని వేణుగోపాల్ రావు సూచించారు. ఫిక్స్డ్ చార్జీలపై ఫ్యాప్సీ అభ్యంతరం విద్యుత్ కేంద్రాల ఫిక్స్డ్ చార్జీలను అసాధారణ రీతిలో పెంచి ప్రతిపాదించడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ) ప్రతినిధి రమణ్‌దీప్ సింగ్ అభ్యంతరం తెలిపారు. పలు పారిశ్రామిక సంఘాల తరఫున ఆయన మాట్లాడారు. ‘కొత్తగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫిక్స్డ్ చార్జీలు భారంగా మారాయి. దీనితో పోల్చితే పాత విద్యుత్ కేంద్రాలు మెరుగ్గా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. జెన్కో ప్రతిపాదించిన వివిధ రకాల వ్యయాలు హేతుబద్ధంగా లేవు. జెన్కో వార్షిక నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయం రూ.792 కోట్లు ఉంటే, అందులో రూ.696.98 కోట్లు వేతన సవరణ వాటా ఉంది..’ అని అన్నారు. ఐదేళ్లలో ఆదాయ అవసరాలు రూ.43,713 కోట్లు: జెన్కో వచ్చే ఐదేళ్లలో రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.4,789 కోట్లు, ఫిక్స్డ్ చార్జీలు రూ.35,931 కోట్లు, అదనపు పెన్షన్ వ్యయాలు రూ.8,205 కోట్లు, మూలధన పెట్టుబడి వ్యయాలు రూ.1,664 కోట్లు, ఇతరత్రాలు కలిపి మొత్తం రూ.43,713 కోట్ల ఆదాయం అవసరం కానుందని జెన్కో తెలియజేసింది. ఆ మేరకు ఆదాయార్జనకు అనుమతిస్తూ ట్రూఅప్, ఎంవైటీ పిటిషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. కాగా జెన్కో పిటిషన్లపై పలువురి అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 29లోగా ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. -
దాదా స్థానంలోకి అతడు.. గంగూలీకి ‘కొత్త’ బాధ్యతలు!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), వుమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో పాటు దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ‘దాదా’ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగనున్నాడు.ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు జేఎస్‌డబ్ల్యూతో పాటు జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండగా... దక్షిణాఫ్రికా లీగ్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంతంగానే జట్టును కొనుగోలు చేసుకుంది. కాగా జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ ఆపరేషన్స్ జీఎంఆర్ పర్యవేక్షించనుండగా.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ డబ్ల్యూపీఎల్ వ్యవహారాలు చూసుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి గురువారమే మరో కీలక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్ర మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపిక చేసింది.గత సీజన్ వరకు సౌరవ్ గంగూలీ ఈ బాధ్యతలు నిర్వర్తించగా... ‘దాదా’ స్థానంలో ఇప్పుడు జట్టు యాజమాన్యం వేణుగోపాల రావును నియమించింది. ఏడేళ్లుగా ఢిల్లీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పాంటింగ్‌ను ఇటీవల తొలగించిన క్యాపిటల్స్ ... అతడి స్థానంలో భారత మాజీ ప్లేయర్ హేమంగ్ బదానీని కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తోంది.ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు జాతీయ జట్టు తరఫున 16 వన్డేలు ఆడాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో సభ్యుడైన వేణుగోపాలరావు... గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున మూడు సీజన్లు ఆడాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చాన్నాళ్లుగా కొనసాగుతున్నా. నా మీద నమ్మకంతో డైరెక్టర్ ఆప్ క్రికెట్ బాధ్యతలు అప్పగించింనందుకు ధన్యవాదాలు. కొత్త సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని వేణు పేర్కొన్నాడు.మరోవైపు 47 ఏళ్ల బదానీ జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. అతడికి కోచింగ్‌లో అపార అనుభవం ఉంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన బదానీ, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో జాఫ్నా కింగ్స్ జట్టుకు కోచ్‌గా రెండు టైటిల్స్ అందించాడు. దక్షిణాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ ఈ్రస్టెన్ కేప్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఇటీవల ఐఎల్టి20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు శిక్షకుడిగా పనిచేశాడు.‘ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా ఎంపికవడం ఆనందంగా ఉంది. నాపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజు్ఞడిని. మేగా వేలానికి ముందు కోచింగ్ బృందాన్ని సమన్వయ పరుచుకొని అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తా. క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని బదానీ అన్నాడు. ‘ఆటపై అపార అనుభవం ఉన్న బదానీ, వేణుగోపాలరావు ఢిల్లీ జట్టుతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కొత్త పాత్రలను వారు సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకముంది’అని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్‌డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ బ్యాటింగ్ కోచ్‌గానూ నియమితుడు కావడం గమనార్హం.పాంటింగ్, గంగూలీకి బైబైహెడ్కోచ్గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
రాష్ట్రానికి ‘భద్రాద్రి’ గుదిబండే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం గుదిబండగా మారిందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన బీహెచ్ఈఎల్కు పనులు అప్పగించడం, కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడమే దీనికి కారణమన్నారు. రూ.7,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా, వాస్తవ వ్యయం రూ.10 వేల కోట్లు దాటిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు బుధవారం హాజరై తమ పిటిషన్లకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తికాక ముందే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమైందని, విద్యుత్ కొరత తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. విద్యుత్ కొరతను అధిగమించే సాకుతో టెండర్లు లేకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని తెలిపారు. 2017లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చేనాటికే భూపాలపల్లిలో 800 మెగావాట్ల కేటీపీపీ, జైపూర్ (మంచిర్యాల జిల్లా)లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్‌తోపాటు జూరా లలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అందుబాటులోకి వచ్చిందని తిమ్మారెడ్డి కమిషన్‌కు వివరించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాకున్నా విద్యుత్ లైన్ల కోసం రూ.630 కోట్లను చెల్లించారని తప్పుబట్టారు. యూనిట్‌కు రూ.3.90 ధరతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వస్తుందని ఒప్పందం చేసుకోగా, వాస్తవ ధర రూ.5.40కు పెరిగిందన్నారు. ఆ సమయంలో దేశంలో రూ.4.20కే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా విద్యుత్ లభించిందని ఆధారాలను కమిషన్‌కు అందజేశారు. మూడేళ్ల తర్వాతే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వచ్చింది.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం 2014లో జరిగితే మూడేళ్ల తర్వాత 2017–18 నుంచి సరఫరా ప్రారంభమైందని, 1000 మెగావాట్లకు గాను 75 శాతమే వచ్చిందని వేణుగోపాల్‌రావు అన్నారు. విద్యుత్ బిల్లుల వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.10–20 వరకు అధిక ధరతో రాష్ట్రం విద్యుత్ కొనాల్సి వచ్చిందన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా అయ్యేందుకు 1000 మెగావాట్ల పవర్ గ్రిడ్ లైన్లను బుక్ చేసుకోగా, పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోయినా రూ.650 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకొని రద్దు చేసుకోవడంతో రూ.261 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఎలక్రి్టసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పవర్‌గ్రిడ్ దావా వేసిందని పేర్కొన్నారు. ఒప్పందం మేరకు రావాల్సిన విద్యుత్ రాకున్నా ఛత్తీస్‌గఢ్‌కు రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. -
పి.గన్నవరం వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా విప్పర్తి వేణుగోపాలరావు
-
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
IPL 2023: క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించనున్న బాలయ్య
Nandamuri Balakrishna: నటసింహం బాలయ్య మరో కొత్త అవతారమెత్తనున్నాడు. సినిమాలు, రాజకీయాలు, ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో బిజీగా ఉండే బాలకృష్ణ.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2023 సీజన్‌తో వ్యాఖ్యాతగా మారనున్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఐపీఎల్ 16వ ఎడిషన్ కోసం బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కామెంట్రీ బాక్స్‌లో బాలయ్య.. వేణుగోపాల్ రావు, ఎంఎస్కే ప్రసాద్, ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, టి సుమన్‌లతో కలిసి వ్యాఖ్యానించనున్నాడు. బాలయ్య తనదైన శైలిలో సినిమాకు, క్రికెట్‌ను అనుసంధానించి ఎలా వ్యాఖ్యానిస్తాడోనని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నతనం నుంచి క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే బాలయ్య, కాలేజీ రోజుల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడేవారట. గతంలో బాలయ్య సినీ తారలు ఆడే సెలబ్రిటీ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు సారధ్యం వహించాడు. బాలయ్య సమయం దొరికినప్పుడల్లా సెట్స్‌లో కూడా క్రికెట్ ఆడేవారని జనాలు చెబుతుంటారు. ఇలా బాలయ్య ప్రతి దశలోనూ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించాడు. క్రికెట్‌పై ఉన్న అమితాసక్తితోనే బాలయ్య స్టార్ స్పోర్ట్స్ తెలుగు వారి ఆఫర్‌ను కాదనలేకపోయారని తెలుస్తోంది. కాగా, మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్- ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
మావోయిస్టు అగ్రనేతల అమ్మ.. మధురమ్మ కన్నుమూత
పెద్దపల్లిరూరల్: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు (కిషన్‌జీ), వేణుగోపాల్‌రావుల మాతృమూర్తి మధురమ్మ (96) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మూడునెలల క్రితం ఇంటి ఆవరణలో జారిపడగా తుంటి ఎముక విరిగింది. వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. వారం క్రితం మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇంటి ఆవరణలోనే తుదిశ్వాస విడవాలన్న ఆమె కోరికపై వెంటిలేటర్‌పైనే పెద్దపల్లిలోని సొంతింటికి తీసుకొచ్చారు. మధురమ్మను పరీక్షించిన వైద్యులు శ్వాస ఆగిపోయిందని ధ్రువీకరించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. పోరాట కుటుంబం.. మావోయిస్టు అగ్రనేతలు కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావుది పోరాట కుటుంబం. తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వ గుర్తింపు పొందారు. తామ్రపత్ర గ్రహీత. అదే పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న కోటేశ్వర్రావు 1975లో అడవిబాట పట్టారు. మరో ఐదేళ్ల తరువాత వేణుగోపాలరావు సైతం కోటన్న బాటనే అనుసరించారు. 11ఏళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో.. కిషన్‌జీ పీడిత, తాడిత ప్రజలకోసం సుదీర్ఘకాలం పనిచేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ పోరాటం పాలకులకు కంటగింపుగా మారింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలో 2011 నవంబర్ 25న జరిగిన ఎన్కౌంటర్లో కోటేశ్వర్రావు అమరుడయ్యారు. వేణుగోపాల్‌రావు ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మొదట పోలీసులు ఒత్తిడి పెంచినా.. పీపుల్స్‌వార్ గ్రూప్‌లో కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కాలంలో మల్లోజుల కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరిగింది. 1986లో అప్పటి డీఎస్పీ బుచ్చిరెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. ఆ కోపంతో పోలీసులు వెంకటయ్య, మధురమ్మల ఇంటిని కూల్చివేశారు. ఆ తర్వాత తాటికమ్మలతో గుడిసె వేసుకుని వారు కొంతకాలం జీవనం సాగించారు. 1997 డిసెంబర్ 26న మల్లోజుల వెంకటయ్య మరణించారు. మధురమ్మకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు ఆంజనేయరావు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి విరమణ పొందారు. మిగిలిన ఇద్దరు ‘కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు జనం కోసం పోరాడుతున్నారు.. అలాంటి కొడుకుల కన్నందుకు గర్వంగా ఉంది’ అని మధురమ్మ చెప్పేదని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
YSR: అఖిల భారతావనికి అడుగుజాడ
వ్యక్తిత్వాన్ని రాజకీయాలకు బలిపెట్టని నాయకుడు వైఎస్సార్. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. మాట తప్పని, మడమ తిప్పని ఆయన గుణమే ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేటట్టు చేసింది. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిలో ఉన్న రైతాంగానికి జీవశక్తిని అందించారు. వ్యవసాయ పునరుజ్జీవనానికి బాటలు పరిచారు. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. కపటం లేని ఆ మందహాసం... సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే ఉంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే ఉంది. ఆ విషాద ఘడియల్లో దేశ వ్యాప్తంగా మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం ‘వైఎస్సార్’. ఆ పేరు ఇక ముందు కూడా వినబడు తూనే ఉంటుంది కానీ, ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు కదా. ఒక వ్యక్తి గుణ గణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసు కునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది. ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీ నిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం. అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ అరవై ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం. 1978 నుంచి ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేఖరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. బిగుసుకుపోయినట్టు ఉండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో అత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిన సందర్భాలున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్‌కు రాష్త్రవ్యాప్తంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది. 1975లో నేను రేడియో విలేఖరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది. వైఎస్సార్‌ను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటీ హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భమది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్. ఇటు హైదరాబాదు లోనూ, అటు ఢిల్లీ లోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేవి. వేళాపాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండడం సహజమే. 2004లో ఆయన తొలిసారి సీఎం కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక విలేఖరికీ, ఒక రాజకీయ నాయకుడికీ నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెన వేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, ‘రెండు కన్నీటి బొట్లు’ రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ సంక్షేమానికి చెదరని చిరునామా నాలుగేళ్లక్రితం చెన్నై వెళ్లినప్పుడు మా బంధువొకాయన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక ప్రశ్న వేశారు. ‘వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన నేతలు న్నారు కదా, కానీ ఆ పథకాలు ప్రస్తావనకు వచ్చి నప్పుడు వైఎస్‌నే అందరూ ఎందుకు గుర్తు చేసు కుంటార’న్నది ఆ ప్రశ్న సారాంశం. నిజమే... ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు సైతం రోజూ గుక్కెడు బువ్వ అందుబాటులోకి వచ్చేలా చేశారు. అంతకు చాన్నాళ్ల ముందే ‘గరీబీ హఠావో’ అంటూ ఇందిరాగాంధీ కూడా ఎన్నో పథకాలు తెచ్చారు. తమిళనాట అధికారంలోకి రాగానే నిరుపేదలకు కలర్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు పంచిపెట్టిన ప్రభుత్వాలున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పోటీలుపడి ఇలాంటి వాగ్దానాలు చేసేవి. అయితే వైఎస్ తీరు వేరు. ఆయన అమలు చేసిన పథకాల ఒరవడే వేరు. ఆ పథకాలు జనసంక్షేమానికి అసలు సిసలైన నిర్వచనంగా నిలిచాయి. అందుకు కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దిగే సమ యానికి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిస్తేజం అలుముకుంది. అప్పటికి ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిపడిన ఉదారవాద ఆర్థిక విధానాల పర్యవసానంగా సమస్త చేతివృత్తులూ దెబ్బతిన్నాయి. వరస కరవులతో, అకాల వర్షాలతో రైతాంగం అల్లాడు తోంది. అప్పుల ఊబిలో దిగబడి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. అప్పటికే ఉన్న ధనిక, పేద; పట్టణ, గ్రామీణ అంతరాలు మరింత పెరిగాయి. కొనుక్కునే స్థోమత ఉంటే తప్ప నాణ్యమైన చదువుకు దిక్కు లేకుండా పోయింది. రోగం వచ్చి ఆసుపత్రులకు వెళ్లినవారికి యూజర్ ఛార్జీల బాదుడు మొదలైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావతో ఇతర సీఎంల కన్నా అత్యుత్సాహంగా సంస్కరణలు అమలు చేయడం వల్ల ఏపీ మరింత దుర్భరంగా మారిందేమో గానీ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ‘ఏదీ వూరికే రాద’ని పాలకులు ఉపన్యాసాలు దంచే పాడుకాలమది. నేలవిడిచి సాముచేసే నాయకులను తమ ముఖపత్రాలపై అచ్చోసే అంతర్జాతీయ పత్రికలకు అప్పుడు కొదవలేదు. సరిగ్గా ఆ సమ యంలో వైఎస్సార్ పాద యాత్ర నిర్వహించి ప్రజల దుర్భర స్థితిగతులను దగ్గర నుంచి చూశారు. 1,400 కిలోమీటర్ల పొడ వునా సామాన్యుల గుండె ఘోషను అతిదగ్గర నుంచి వినగలిగారు. వీరందరి జీవితాల మెరుగుదలకు ఏం చేయగలమన్న మథనం ఆయనలో ఆనాడే మొదలైంది. తర్వాత కాలంలో ఆయనే చెప్పుకున్నట్టు ఆ పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాగల అయిదేళ్లకూ పాలనా ప్రణాళికను నిర్దేశించింది. వ్యక్తిగా కూడా ఆయనను ఆ పాదయాత్ర ఎంతో మార్చింది. రాయలసీమ ప్రాంత నేతగా సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై ఆయనకు మొదటి నుంచీ అవగాహన ఉంది. కానీ అది ‘జలయజ్ఞం’గా రూపుదిద్దుకున్నది జనం మధ్యనే! అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆ లక్ష్యం వేల కోట్ల వ్యయంతో ముడిపడి ఉంటుంది గనుక అది అసాధ్యమనుకున్నారంతా! కానీ భర్తృహరి చెప్పినట్టు ఎన్ని అడ్డంకులెదురైనా వెరవక తుదికంటా శ్రమించడమే కార్యసాధకుల నైజమని వైఎస్ భావించారు. ఈ అనితర సాధ్యమైన ప్రయత్నానికి సమాంతరంగా ఉచిత విద్యుత్ జీవోపై తొలి సంతకం చేసి అన్నివిధాలా చితికిపోయి ఉన్న రైతాంగానికి తక్షణ జీవశక్తిని అందించారు. బాబు పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని మళ్లీ పట్టాలెక్కించి, దాని పునరుజ్జీవానికి బాటలు పరిచారు. అంతేకాదు... అంతవరకూ ఆకాశపు దారుల్లో హడావిడిగా పోయే ఆరోగ్య సిరిని భూమార్గం పట్టించి నిరుపేదలకు సైతం ఖరీదైన కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద వర్గాల పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభి వృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన సాహసిగా, తనకు తెలిసినవారైనా కాకున్నా, తన పార్టీవారు అయినా కాకున్నా సాయం కోరివచ్చిన వారందరి పట్లా ఒకేలా స్పందించిన సహృదయుడిగా వైఎస్ చిరస్థాయిగా నిలుస్తారు. పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి నేతను దేశవ్యాప్త రైతాంగానికి రుణమాఫీ తక్షణావసరమని ఒప్పించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర. ఇలాంటి నాయకుడు సంక్షేమానికి శాశ్వత చిరునామా కావడంలో, ఆ విషయంలో అఖిల భారతావనికి అడుగుజాడ కావడంలో ఆశ్చర్యమేముంది? -టి. వేణుగోపాలరావు సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణ ఒకనాటి ‘పండోరా’.. చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: చుట్టూ చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు.. వాటితో ఏర్పడిన కొండలు, గుట్టలు.. భారీ వృక్షాలు.. జీవరాశులు.. వీటన్నింటి మధ్య ఉప్పొంగి ప్రవహించే పెద్ద నది.. ఇవన్నీ ఏదో హాలీవుడ్ సినిమాలో సీన్లు కాదు. అచ్చంగా ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో నెలకొన్న పరిస్థితులు. ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇవన్నీ వాస్తవాలే. ఇప్పుడున్న ఖండాలు, భూభాగాలు అప్పట్లో కలిసి ఉండేవి. కోట్ల ఏళ్ల పరిణామక్రమంలో కొన్ని విడిపడి, కొంత కలిసిపోయి ఇప్పుడున్న రూపానికి వచ్చాయి. ఆ మార్పులను చూడటానికి మన జీవితకాలం సరిపోదు. కానీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అలనాటి పరిస్థితులను గుర్తించారు. ఈ క్రమంలో జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావును ‘సాక్షి’పలకరించగా.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. చకిలం వేణుగోపాలరావు సున్నపురాతి గనులు వాటి చలవే.. తెలంగాణ ప్రాంతంలో ఇటు ఉమ్మడి నల్గొండ, అటు తాండూరు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సున్నపురాతి నిల్వలకు కారణం నాటి సముద్ర భాగాలే. అప్పట్లో సముద్ర తీరం నుంచి తక్కువ లోతుండే భాగం వరకు భారీగా సున్నపురాతి నిల్వలు ఏర్పడ్డాయి. ఆ సముద్రాలు అంతం కాగా.. సున్నపురాయి నిల్వలు ఇప్పుడు మనకు పనికొస్తున్నాయి. ఈ బొగ్గు నిల్వలు 30 కోట్ల ఏళ్లవి.. తెలంగాణ భూభాగం, దీని పరిసరాల్లోని బొగ్గు పొరలు దాదాపు 30 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాన్ని జియోలజిస్టులు గోండ్వానా బేసిన్గా పేర్కొంటారు. అప్పట్లో ఈ ప్రాంతాల మీదుగా అమెజాన్ కంటే భారీ మంచినీటి నది ప్రవహించేది. ఆ నది ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖండం (అప్పట్లో ఈ భూభాగాలన్నీ కలిసి ఉండేవి) వరకు విస్తరించి ఉండేది. నది పరీవాహకంలో ఏకంగా ఆరేడు మీటర్ల చుట్టుకొలతతో కాండం ఉండే భారీ వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. అప్పట్లో ఏర్పడిన ప్రకృతి విపత్తులతో ఆ వృక్షాలన్నీ కూలిపడి.. పైన మట్టిపొరలు పేరుకుపోయాయి. లక్షల ఏళ్లు ఒత్తిడికి, ఉష్ణోగ్రతలకు గురై బొగ్గుగా మారాయి. ఇప్పుడా బొగ్గు నిల్వలనే మనం తవ్వి వినియోగించుకుంటున్నాం. అలనాటి భారీ నదితో సంబంధం లేకున్నా.. ఇప్పుడా పరిధిలోనే గోదావరి నది ప్రవహిస్తుండటం విశేషం. అవన్నీ లావా గుట్టలే.. ఒకప్పుడు తెలంగాణ భూభాగంలోని కొంత ప్రాం తంలో అగ్నిపర్వతాల లావా ప్రవహించింది. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఘనీభవించి పీఠభూమి ఏర్పడింది. ఈ పరిధిని డెక్కన్ వల్కానిక్ ప్రావిన్స్ (డీవీపీ)గా పేర్కొంటారు. శంకర్పల్లి, చేవెళ్ల, వికారాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్రవైపున్న కొన్ని ప్రాంతాలు దాని పరిధిలో ఉంటాయి. ఈ ప్రాంతంలోని గుట్టలన్నీ సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద ఉబికివచ్చిన లావాతో ఏర్పడినవే. మిగతా తెలంగాణలో గ్రానైట్, డోలరైట్ రాళ్ల గుట్టలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు కొంత దూరం చేవెళ్ల సమీపంలోని ముడిమ్యాల గ్రామం వద్ద ఆ లావా అవశేషాలను జియోలజిస్టులు గుర్తించారు. ఆ లావా ప్రవాహాల సమయంలోనే ఇక్కడి డైనోసార్లు అంతరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గోదావరి తీర ప్రాంతాల్లో ఆ డైనోసార్ల శిలాజాలు లభిస్తున్నాయి. సముద్రాల మధ్య.. ఒకప్పుడు ప్రస్తుతమున్న తెలంగాణ పీఠభూమి ప్రాంతానికి పక్కన రెండు సముద్రాలు ఉండేవి. దిగువన ఉన్నదానికి కడప బేసిన్ అని, ఎగువన ఉన్నదానికి పాకాల బేసిన్ అని జియోలజిస్టులు పేరుపెట్టారు. శేషాచలం కొండలు, నగరి జగ్గయ్యపేట మొదలు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, మహబూబ్‌నగర్–ఖమ్మం జిల్లాల్లోని కొంత ప్రాంతంలో కడప బేసిన్ విస్తరించి ఉండేది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధి అంతా పాకాల బేసిన్ పరిధిలో ఉండేది. ఈ రెండు సముద్ర బేసిన్లు కూడా.. ఖమ్మం జిల్లా చిరునోముల గ్రామం వద్ద 10–12 మీటర్ల పాయతో అనుసంధానమై ఉండేవని గుర్తించారు. పాకాల బేసిన్లో సులువాయి, పెన్‌గంగ అన్న రెండు సబ్బేసిన్లను.. కడప బేసిన్లో కర్నూల్, పల్నాడు అనే రెండు సబ్ బేసిన్లను గుర్తించారు. ఇవన్నీ 160 కోట్ల ఏళ్ల నుంచి 55 కోట్ల ఏళ్ల కిందటి వరకు ఉండేవని అంచనా. ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలుడు.. తెలంగాణలో బూడిద సుమారు 75 వేల ఏళ్ల కింద ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలైంది. దాని నుంచి వెలువడిన బూడిద వేల కిలోమీటర్ల దూరం విస్తరించింది. అలా పడిన బూడిద నీటి ప్రవాహాలతో కొట్టుకుపోయి కొన్నిచోట్ల కుప్పగా చేరింది. అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ అగ్నిపర్వతం బూడిద కుప్పలు మేటవేసి ఉన్నాయి. కొత్తగూడెం సమీపంలోని ముర్రేరు వద్ద, మంజీరా లోయలోని కొన్ని ప్రాంతాల్లో సదరు బూడిద కుప్పలను జియోలజిస్టులు ఇప్పటికే గుర్తించారు. ఏపీలోని బనగానపల్లి సమీపంలో జ్వాలాపురం గ్రామంలో మెరుగుసుద్దగా పిలుచుకునే బూడిద కుప్పలు వీటిలో భాగమే. ఆ బూడిదనే కొన్ని కంపెనీలు గిన్నెలు తోమేందుకు వినియోగించే పౌడర్‌గా తయారు చేసి అమ్ముతున్నాయి. -
వారసత్వ ఉద్యోగాల పేరుతో ద్రోహం
టీఆర్ఎస్ సర్కారుపై మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ జాగృతి నాయకులతో కేసులు వేయించిందని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వేణుగోపాలరావు, ఆరేపల్లి మోహన్, పి.శశిధర్‌రెడ్డితో కలసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లా డుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో కోర్టులో కేసులు వేయించారన్నారు. టీఆర్ఎస్ ద్రోహ పూరిత రాజకీయాలను సింగరేణిలో ప్రచారం చేయడానికి 20 మందితో టీపీసీసీ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రవి వెల్లడిం చారు. దీనికి మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి చైర్మన్‌గా, ఐఎన్టీయూసీ ఉపా ధ్యక్షుడు జనక్‌ప్రసాద్ కన్వీనర్‌గా, డి.శ్రీధర్ బాబు, బలరాంనాయక్, టి.నాగయ్య, మహేశ్వర్ రెడ్డి, అరవింద్‌రెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నట్టు తెలిపారు. -
నిర్మాతల కోసం వినోద పన్ను మినహాయింపు
దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకుల ప్రయోజనం కోసం కాకుండా సినిమాల నిర్మాతల కోసం వినోద పన్నును మినహాయింపునిస్తున్నాయని, దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు పొందిన నిర్మాతలు... దాని ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింపచేయకుండా స్వలాభం పొందుతున్నారని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు పేర్కొన్నారు. అలాంటి నిర్మాతల నుంచి ఆ మొత్తాలను వసూలు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఇందులో ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, తెలంగాణలో రుద్రమదేవి సినిమాకు వినోద పన్ను మినహాయింపు పొందిన గుణ టీమ్ వర్క్స్, ఏపీలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు పొందిన రాజీవ్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 100 శాతం మినహాయింపు చట్ట విరుద్ధం... మంచి సినిమాను ప్రోత్సహించడంలో భాగం గా ప్రభుత్వాలిచ్చే వినోద పన్ను మినహాయింపు మొత్తాన్నీ టికెట్ ధర నుంచి మినహా యించాలని పిటిషనర్ పిటిషన్లో తెలిపారు. రుద్రమదేవి సినిమాకి తెలంగాణ ప్రభుత్వం, గౌతమీపుత్ర శాతకర్ణికి ఉభయ ప్రభుత్వాలూ 100% వినోద పన్ను మినహాయించాయ న్నారు. నిబంధనల ప్రకారం 50% కిమించి పన్ను మినహాయింపు ఇవ్వరాదన్నారు. -
పండగవేళా పనికి రాలేదా!
తొలి టెస్టుకు వేణుకు దక్కని ఆహ్వానం తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తూ పండుగ వాతావరణంలో సంబరం చేసుకున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వేణుగోపాల రావును మాత్రం విస్మరించింది. టెస్టు ప్రారంభానికి ముందు ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గవాస్కర్, కుంబ్లే, మంజ్రేకర్, శివరామకృష్ణన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్‌లను పిలిచి మెమెంటోలు ఇచ్చి సత్కరించిన ఏసీఏ... ఆంధ్ర నుంచి భారత జట్టుకు ఆడిన వేణును కనీసం మ్యాచ్‌కు ఆహ్వానించలేదు. సాధారణంగా ఏ క్రికెట్ సంఘమైనా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సత్కరించడం ఆనవారుుతీ. ఆంధ్ర తరఫున భారత్‌కు ఆడిన వాళ్ల సంఖ్య కూడా ఎక్కువేం లేదు. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కేతో పాటు వేణు మాత్రమే ఆ ఘనత సాధించారు. వేణును కూడా పిలిచి ఓ మెమెంటో ఇచ్చి ఉంటే బాగుండేది. వైజాగ్‌లోనే ఉన్నా వేణుకు ఎలాంటి ఆహ్వానం పంపలేదు. కనీసం ఒక ఫోన్, మెరుుల్ కూడా లేదు. రాష్ట్ర గౌరవం పెంచిన ఓ మాజీ భారత క్రికెటర్‌కు ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏసీఏలోని కొందరు కీలక వ్యక్తులకు వేణు అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేనందు వల్ల ఇలా చేశారని వారి సహచరులే అంటున్నారు. ఏమైనా ఇలాంటి కక్షపూరిత చర్యలు క్రికెట్‌కు ఎంత మాత్రం మంచిది కాదు. -
వేణును ఆడించాల్సిందే...
సాక్షి నెట్వర్క్: ఆంధ్ర క్రికెట్ సంఘం వేణుగోపాలరావు లాంటి సీనియర్ క్రికెటర్ సేవలను వినియోగించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే నిబంధన సాకుతో వేణును ఏసీఏ పక్కనపెట్టడంపై సాక్షిలో వచ్చిన కథనంపై పలువురు స్పందించారు. రూల్ కరెక్ట్ కాదు ‘లక్షలకు లక్షలు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల నుంచి క్రికెటర్లను తెచ్చి ఆడిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న కైఫ్‌ను తెచ్చి ఆడించారు. స్థానిక ఆటగాడు వేణును ఆడించకపోవడం అన్యాయం. సంవత్సరం పాటు ఎక్కడా ఆడకూడదు అంటూ వేణుకు నిబంధన పెట్టడం ఎంత వరకు సమంజసమో ఏసీఏ పెద్దలు ఆలోచించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే రూల్ కరెక్ట్ కాదు. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్ర క్రికెటర్‌ను అవమానించడం కరెక్ట్ కాదు.’ - మధుసూదన్ రాజు, ఆంధ్ర సెలక్షన్ కమిటీ మాజీ సభ్యుడు అవసరమైతే నిబంధనలు మార్చాలి ‘వేణు మంచి క్రికెటర్. ఉత్తరాంధ్ర నుంచి దేశానికి ఆడిన ఏకైక ఆటగాడు. కొత్త కొత్త నిబంధనలు సాకుగా చూపించి ఆంధ్ర జట్టులోకి తీసుకోకపోవడం విచారకరం. అవసరమైతే నిబంధనలు మార్చాలి. ఈ విషయంపై నేను ఏసీఏ కార్యదర్శి గంగరాజుతో మాట్లాడతాను’. - విష్ణుకుమార్ రాజు, ఉత్తర విశాఖపట్నం ఎమ్మెల్యే ఐదు నిమిషాలు చాలు... ‘వేణు క్రమశిక్షణ కలిగిన క్రికెటర్. అలాంటి ఆటగాడిని ఆడించకపోవడం అన్యాయం. బయటి వాళ్ల చుట్టూ తిరిగే బదులు అనుభవం ఉన్న ఆంధ్ర ఆటగాడిని ఆడించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ బీసీసీఐ రూల్ కాదు. ఈసీ మీటింగ్ పెట్టి ఐదు నిమిషాల్లో నిబంధన మార్చవచ్చు. ఆటగాడు తన కెరీర్ కోసం ఎక్కడైనా ఆడొచ్చు. -వెంకట్రావు, ఏసీఏ మాజీ ప్రధాన కార్యదర్శి -
వేణుగానానికి ని'బంధనాలు'!
అతను ఒకప్పుడు భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఏకంగా 18 సంవత్సరాల అనుభవం ఉంది. వయసు 34 ఏళ్లు. ఇంకా నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఆంధ్ర నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరిలో అతనూ ఒకడు. కానీ ఇంత అనుభవం, ఈ ఘనత ఆంధ్ర క్రికెట్ సంఘాని (ఏసీఏ)కి సరిపోవడం లేదు. కుర్రాళ్లకు మార్గనిర్దేశం కోసం అరువు ‘సీనియర్లను’ తెచ్చి ఆడిస్తున్న ఏసీఏ... సుదీర్ఘ అనుభవం ఉన్న సొంత క్రికెటర్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కొందరు పెద్ద మనుషుల సొంత ఈగోలతో వేణుగోపాలరావును పక్కన పెట్టేశారు. ఒకప్పుడు రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన ఆటగాడిగా కీర్తి తెచ్చుకున్న క్రికెటర్... ఈ రోజు జట్టులో చోటు కోసం పది మందినీ బతిమిలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే దిగజారిపోయిన ఆంధ్ర క్రికెట్ ఆటతీరు ఇలాంటి శైలి వల్ల అధఃపాతాళానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. * ఆంధ్ర క్రికెట్ సంఘానికి అక్కరకు రాని సొంత ఆటగాడు * వేణుగోపాలరావును అడ్డుకోవడానికి తెరపైకి కొత్త నిబంధన సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ఓ ఆటగాడు నేను ఆడతాను అని ముందుకు వస్తే... నువ్వు ఫామ్‌లో లేవనో లేకపోతే నీకంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నారనో చెబితే... ఆ ఆటగాడు మరింత కష్టపడో, ఇంకా మెరుగ్గా ఆడో జట్టులో స్థానం కోసం పోరాడతాడు. కానీ అనుభవం కోసం బయటి రాష్ట్రాల క్రికెటర్ల వైపు చూసే ఆంధ్ర క్రికెట్ సంఘం... తమ దగ్గరే అత్యంత అనుభవజ్ఞుడు ఉన్నా... జట్టులోకి తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే... ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ అనే నిబంధనను చూపిస్తోంది. నిజానికి ఈ నిబంధన దేశంలో ఏ క్రికెట్ సంఘంలోనూ లేదు. ఆంధ్ర క్రికెట్లోనూ ఈ ఏడాది కొత్తగా ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఇంతకాలం లేనిది ఈసారి వేణుగోపాలరావు తిరిగి ఆంధ్రకు ఆడతానంటుండగానే ఎందుకు ఈ నిబంధన వచ్చింది..? ఆటగాడు దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు నుంచి నిరభ్యంతరకర పత్రం (ఎన్ఓసీ) తీసుకొని మరో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే పునరాగమనం చేసేందుకు కనీసం మూడేళ్ల వ్యవధి ఉండాలి... క్రికెటర్ల బదిలీలకు సంబంధించి ఉన్న నిబంధన ఇది. ఆంధ్ర క్రికెటర్ వేణుగోపాలరావు గత మూడు సీజన్లు గుజరాత్ తరఫున ఆడాడు. చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అతను ఆంధ్రకు తిరిగి రావాలని భావించాడు. అయితే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ కనీసం ఏడాది ఉండాలంటూ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇప్పుడు అతడి అవకాశాన్ని దెబ్బ తీస్తోంది. బయటి జట్టుకు ఆడిన తర్వాత మళ్లీ సొంత టీమ్‌లోకి వచ్చే ముందు ఒక సీజన్ పాటు మరే జట్టుకూ ఆడకుండా విరామం పాటించాలనేదే ఈ నిబంధన. అరుుతే గతంలో ఎప్పుడూ ఇలా లేదు. దేశంలో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా... ఆడగల సామర్థ్యం, ఆసక్తి ఉంటే విరామంతో పని లేకుండా నేరుగా సొంత జట్టు సెలక్షన్సకు అర్హత పొందేవాడు. కానీ వేణుకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ నిబంధన తెచ్చారు. మార్గదర్శి కాలేడా... వేణుగోపాలరావు ఆటగాడిగా అద్భుతమైన ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఇటీవల దేశవాళీ క్రికెట్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ప్లేయర్ కంమెంటర్ పాత్రకు అతను సరిగ్గా సరిపోతాడు. 120 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 7 వేలకు పైగా పరుగులు చేసిన అనుభవం అతనికి ఉంది. ఇప్పుడు ఆంధ్ర టీమ్‌లో ఎక్కువ మంది కుర్రాళ్లే ఉన్నారు. వారితో కలిసి ఆడుతూ, వారిలో భాగమై రంజీ ట్రోఫీలో వారిని సరైన దిశలో నడిపించగల వ్యక్తి జట్టుకు అవసరం. బయటి వ్యక్తికంటే మన మనిషిగా అతను ఆటగాళ్లందరితో కలిసిపోగలడు. ప్రస్తుతం ఆంధ్ర జట్టు గ్రూప్ ‘సి’లో ఉంది. ఇప్పుడు సీనియర్‌గా బాధ్యతలు చూడగలిగే మరో మంచి ప్రత్యామ్నాయం కూడా ఆంధ్ర వద్ద ఏమీ లేదు. సీనియర్ పేరు చెప్పి 36 ఏళ్ల బద్రీనాథ్‌ను హైదరాబాద్ తెచ్చుకుంటున్నప్పుడు నేను ఆడతానంటూ ముందుకు వస్తున్న 34 ఏళ్ల వేణుగోపాలరావును కాదనడంలో అర్థం లేదు. వీరికంటే మెరుగు కాదా..? అమోల్ మజుందార్ రెండేళ్ల కెప్టెన్సీలో ఆంధ్రకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. రెండో సీజన్లో అరుుతే అతను నా వల్ల కావడం లేదంటూ నాలుగు మ్యాచ్‌ల తర్వాతే చేతులెత్తేసి తప్పుకున్నాడు. మొహమ్మద్ కైఫ్ అరుుతే గత సీజన్లో 13 ఇన్నింగ్స లలో 27.50 సగటుతో కేవలం 330 పరుగులు చేశాడు. దాంతో ఆంధ్ర అతడిని ఈసారి వద్దనుకుంది. వేణుగోపాలరావు నుంచి ఇంతకంటే మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చు. గత ఏడాది వరకు హైదరాబాద్‌కు ఆడిన హనుమ విహారి, డీబీ రవితేజ ఈసారి ఆంధ్ర తరఫున ఆడేందుకు వెళ్లారు. వీరిద్దరు పుట్టిన ప్రాంతం ఆంధ్ర (కాకినాడ) కాబట్టి ఇంత కాలం ఆడినదానితో సంబంధం లేకుండా వీరిని సొంత ఆటగాళ్లుగానే పరిగణిస్తున్నారు. వీరికి ఎలాంటి నిబంధనల అడ్డంకులు లేవు. ఈ సీజన్లో కొత్తగా గుజరాత్ నుంచి వచ్చిన భార్గవ్ భట్‌కు ఆంధ్ర అవకాశం కల్పిస్తోంది. మరి వేణుగోపాలరావును మాత్రం దూరం పెట్టడంలో ఔచిత్యం అనిపించుకోదు. కొందరికే కష్టం..? వేణు తిరిగి ఆంధ్ర తరఫున ఆడతానని రాగానే ఏసీఏలోని మెజారిటీ వ్యక్తులు సంతోషించారు. ‘అరువు’ అవసరం లేకుండా సీనియర్ ఉన్నాడులే అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఏసీఏలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి మాత్రం వేణును అడ్డుకుంటున్నారు. త్వరలో లోధా కమిటీ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రస్తుత ఏసీఏ కార్యవర్గంలో మార్పులు జరగాలి. కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తప్పుకోవాలి. ఆయన తన కుమారుడిని కార్యదర్శిని చేయడానికి రంగం సిద్ధం చేశారు కూడా. ఈ సమయంలో ఏసీఏలో కీలకమైన వ్యక్తులతో విభేదించడం అనవసరమని ఆయన భావించినట్లున్నారు. కానీ ఇలా వ్యక్తుల అవసరాలు, ఈగోలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే... నష్టపోయేది మాత్రం ఆంధ్ర క్రికెట్టే. ‘ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆడిన వాళ్లు తిరిగి వస్తే ఒక సంవత్సరం ఆడించకూడదనే నిబంధన మేమే పెట్టుకున్నాం. గతంలో వేరే రాష్ట్రానికి ఆడి ఇప్పుడు ఇక్కడ ఆడతా అంటే కుదరదు. ఇక్కడ చాలా మంది యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. జట్టుకు ఉపయోగపడతారనుకుంటే బయటి రాష్ట్రాల సీనియర్లను తీసుకుంటాం’. - గోకరాజు గంగరాజు, ఏసీఏ కార్యదర్శి -
'త్వరలో గూడూరు- దుగరాజుపట్నం రైల్వే పనులు'
నెల్లూరు : గూడూరు - దుగరాజుపట్నం మధ్య రైల్వే లైన్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు విజయవాడ ఏడీఆర్ఎమ్ వేణుగోపాలరావు వెల్లడించారు. గురువారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... విజయవాడ - గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యల తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో వైఫై సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సౌకర్యం నెల్లూరు రైల్వే స్టేషన్ కల్పించే అవకాశాలు ఉన్నాయని వేణుగోపాలరావు తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి
మామూళ్లు తీసుకుంటున్న వాణిజ్య పన్నుల శాఖాధికారిని అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సరూర్‌నగర్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వేణుగోపాలరావు ఓ వ్యక్తి నుంచి రెండువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వేణుగోపాలరావు కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. -
విత్తన చోరులకు రాయల్టీలెందుకు?
జన్యుమార్పిడి పత్తి విత్తనాలు విత్తన పరాధీనతకు దారితీశాయి. సమాజ సొత్తయిన స్థానిక విత్తనాలను కంపెనీల గుత్తాధిపత్యం నుంచి కాపాడుకునే దిశగా ైరె తులు కదలాలి. ఇందుకు తగిన రక్షణ చట్టాలను ప్రభుత్వం రూపొందించాలంటున్నారు ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు వ్యవసాయంలో భూమి, నీరు తరువాత అత్యంత కీలకమైనవి పంట విత్తనాలు. హరిత విప్లవంలో విత్తనాల అభివృద్ధికి ప్రముఖ స్థానమిచ్చారు. నార్మన్ బోర్లాగ్నో, స్వామినాథన్నో, వ్యవసాయ విశ్వవిద్యాలయాలనో, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలనో తరచుగా రైతులు మననం చేసుకోటానికి ముఖ్య కారణం ఆ వ్యక్తులు, సంస్థలు ప్రవేశపెట్టిన నూతన తరం విత్తనాలే. అన్ని ముఖ్య పంటల మూల విత్తనాలు రైతులు అనాదిగా కాపాడుకుంటున్నవే. మంచి వ్యక్తీకరణ(గింజ, కాండం, వేరు, ఆకు, కాయ) గల పంట రకాన్ని గుర్తించటంలో, సంకరపరిచే నైపుణ్యతలను పెంపొందించు కోవటంలో రైతులు, గిరిజన జాతుల పాత్ర కాదనలేనిది. ప్రస్తుతం మనం రూపొందించుకున్న మెరుగైన వంగడాలకు, హైబ్రిడ్లకు మూలాలు ఆ విత్తనాలే. కానీ, విత్తనం ఇప్పుడు కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయే దుస్థితి నెలకొంది. జన్యువైవిధ్యత, పెరుగుదల, వ్యక్తీకరణల వైవిధ్యాలున్న పంట మొక్కలెక్కువగా ఉష్ణ లేక సమశీతోష్ణ ప్రాంతాల్లో.. అనగా సంపదల్ని పోగెయ్యటంలో వెనుకబడ్డ(ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా) దేశాల్లో రూపొందాయి. ఈ వైవిధ్యం సంపన్న ఐరోపా, ఉత్తర అమెరికాలలో చాలా తక్కువ. అయినా జన్యుపరంపరాధారిత సైన్స్ వెలుగులో ఉద్భవించిన సాంకేతికాల ద్వారా కృత్రిమంగా పంట మొక్కల్లో జన్యువైవిధ్యతను రూపొందించగలిగాయి ధనిక దేశాలు. శాస్త్రవేత్తలు ఇతర సాంకేతికాలతో పాటు విత్తన సాంకేతికాల్ని కూడా వాణిజ్య ఆయుధాలుగా మార్చారు. అదిగో ఆ నేపథ్యంలో ప్రపంచమంతా విస్తరించినదే ‘హరిత విప్లవం’. సామాజిక స్పృహతో విస్తృతపరచిన సంపదలు సార్వత్రిక, సర్వజన పరమైన నేపథ్యంలో ఈ టెక్నాలజీలు రూపొందాయనేది అతి ముఖ్యవిషయం. మార్కెట్ శక్తుల చేతికి.. ఐతే హరిత విప్లవ విస్తరణ మలి దశలో ప్రపంచ దేశాల రాజకీయ వ్యవస్థలు మారుతూ వచ్చాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల్ని పర్యావరణ పటిష్టత(సుస్థిరత)ను కాపాడగల ప్రభుత్వాల స్థానంలో మార్కెట్ శక్తుల ద్వారా నియంత్రిచబడే పాలకులొచ్చారు. సైన్స్, టెక్నాలజీ పూర్తిగా వ్యాపార వర్గాల పరిష్వంగంలో చేరిపోయాయి. పేటెంట్ చట్టాలు, రాయల్టీలు వంటి వాటి ముసుగులో అన్ని వనరులతో అటు వ్యవసాయ వనరులను ప్రజల నుంచి దూరం చేసే ఒరవడి మొదలైంది. అదిగో ఆ నేపథ్యంలో వెలుగు చూసిన జన్యుమార్పిడి పంట విత్తనాలు పూర్తిగా ప్రభుత్వ(ప్రజా) సంస్థలకు దూరమై వ్యాపార వర్గాల అజమాయిషీలోకెళ్లాయి. జన్యుమార్పిడి విత్తనాల ద్వారా దిగుబడులు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయనే కంపెనీల ప్రచార హోరులో ప్రభుత్వాలు, శాస్త్త్రవేత్తలు, రైతులు కొట్టుకుపోయే స్థితిని తెచ్చారు. భారత వ్యవసాయరంగం చుట్టూ ఎంత పెద్ద కుట్ర అల్లుకున్నదో చూడండి.. బీటీ పత్తి ప్రహసనం బీటీ హైబ్రిడ్ వంగడాల వల్ల పత్తి దిగుబడులు అనూహ్యంగా పెరిగినట్లు మోసపూరిత ప్రచారాలు మొదలెట్టి ఇటువంటి టెక్నాలజీల్ని వరి వంటి ఇతర పంట విత్తనాల్లోకి ప్రవేశపెట్టే నేపథ్యాన్ని సృష్టించారు. కేంద్రంలో ప్రభుత్వం మారగానే కంపెనీలు, ముఖ్యంగా మోనోశాంటో, తమ విత్తన కుట్ర ఆచరణకు నడుం బిగించాయి. జన్యుమార్పిడి బీటీ విత్తనాల విషయంలో ఇప్పటి వరకూ సరైన సమాచారాన్ని ఏ కంపెనీ కూడా ప్రభుత్వాల ముందు.. శాస్త్ర, సాంకేతిక సంస్థల ముందు ఎందుకు ఉంచలేకపోతున్నాయని నోబెల్ బహుమతి గ్రహీతలైన జీవ సాంకేతిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బీటీ హైబ్రిడ్ విత్తనంతోనే పత్తి దిగుబడులు పెరిగాయనేది వాస్తవమైతే, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా దేశాల్ల్లో కేవలం బీటీ జన్యువున్న సూటి రకాలే ఎందుకు సాగు చేసున్నట్లు? అక్కడి సగటు దిగుబడులు మనకంటే ఎక్కువేననే నిజాన్ని కంపెనీలు ఎందుకు దాస్తున్నట్లు? జీవుల్ని, జంతువుల్ని గుత్త సొమ్ముగా మార్చుకోవటం అనైతికమనే ప్రపంచ స్థాయి ఒప్పందాన్ని మోన్శాంటో కంపెనీ ఎందుకు ధిక్కరిస్తున్నట్లు? బీటీ హైబ్రిడ్ విత్తనాలకు మూలాధారాలుగా నిలిచిన పత్తి వంగడాలు రైతుల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినవే. వాటికి కంపెనీలు ఎంత రాయల్టీలు చెల్లిస్తున్నాయి? బీటీ హైబ్రిడ్ విత్తన ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే కంపెనీలు రైతులకు అమ్ముతున్న ధర చాలా ఎక్కువ. దానిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోగా ప్రభుత్వ సంస్థల ద్వారా కంపెనీలు ఎక్కువ ధరలకు రైతులకు అమ్మడం ఎంతవరకూ వ్యాపార నీతి? బీటీ హైబ్రిడ్ పత్తిని వర్షాధారంగానూ, అల్ప భూసార నేలల్లోనూ సాగుచేసే స్థితికి తీసుకురావటానికి ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం, కంపెనీల ప్రచార హోరు కారణం. దీనికి జవాబుదారీ ఎవరు? బీటీ పత్తివల్ల సస్యరక్షణ రసాయనాల వాడకం తగ్గిందనే ప్రచారంలో హేతుబద్ధతెంత? అతి తక్కువ ప్రమాణాల్లోనే ఘాటు విషాల్ని వదలగల నూతన రసాయనాల్ని పాత విష రసాయనాల్తో పోల్చగలమా? బీటీ హైబ్రిడ్ మాయలో పడి పోగొట్టుకుంటూ పోతున్న దేశీయ, స్థానిక పత్తి రకాల్ని ఎవరు పునరుద్ధరించగలరు? బీటీ పత్తి పేరుతో నడిచిన కుట్ర విత్తన పరాధీనతకు దారితీసింది. ఇది మనకు పాఠం నేర్పాలి! విత్తనాల్ని కాపాడుకునే ఉద్యమంలో రైతుల పాత్ర పెరగాలి. ఇందుకు తగిన రక్షణ చట్టాల్ని ప్రభుత్వం రూపొందించాలి. (వ్యాసకర్త గుంటూరులోని రైతు రక్షణ వేదిక కన్వీనర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్రాంతాచార్యులు. nvgrao2002@yahoo.com) -
పరిశోధనలే ప్రాణం... ప్రపంచ స్థాయి ప్రశంసలు
ఆ యువకుడికి పరిశోధనలంటే ప్రాణం.. అలాని అందరిలా కాకుండా... వేల మందిలో ఒకడిలా ఉండాలనుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తీసుకురావాలనే సంకల్పంతో సాగుతున్నాడు. ఆ ప్రయత్నంలో ఇదివరకెవ్వరూ కనిపెట్టని సిలియమ్ అనే అరుదైన ప్రొటీన్ పదార్థం-దాని నిర్మాణం గుట్టును విప్పే పరిశోధనలకుప్రాణం పోశాడు. ఫలితం పలు ప్రపంచ వేదికలు వేనోళ్ల పొగిడాయి. ప్రతిష్టాత్మక సైన్స్ మ్యాగజైన్ అద్భుతం అంటూ ప్రశంసించింది..స్ర్టక్చరల్ బయాలజీ అండ్ బయో కెమిస్ట్రీ విభాగంలో రాణిస్తున్న తెలుగు తేజం, యువ శాస్త్రవేత్త సాగర్ భోగరాజు సక్సెస్ స్పీక్. మాది నిజామాబాద్. నాన్న బీఆర్ వేణుగోపాలరావు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. అమ్మ విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తమ్ముడు సత్యం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేమిద్దరం కాన్పూర్ ఐఐటీలోనే చదువుకున్నాం. తెలుగు మీడియం విద్యార్థినే: పదో తరగతి వరకు చదువంతా తెలుగు మీడియంలోనే సాగింది. ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్ మీడియం కావడంతో ప్రారంభంలో కొంత ఇబ్బంది అనిపించింది. చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్తగా స్థిరపడాలనేది కోరిక. దానికితోడు పరిశోధనలంటే ఆమితమైన ఆసక్తి. అందుకే ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ చదివినప్పటికీ.. ఐఐటీలో చేరాక బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్‌పై దృష్టి సారించాను. అంతేకాకుండా ఐఐటీ ఇంజనీరింగ్‌లో రెండు సార్లు జూనియర్ సైంటిస్ట్ పురస్కారాలను కూడా అందుకున్నాను. మ్యూనిచ్ వర్సిటీకి ఎంపిక: 2008లో ఢిల్లీలోని ఎవాల్యూ సర్వ్ అనే మేధో హక్కుల సంస్థలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేస్తూ, జర్మనీ దేశం మ్యూనిచ్ నగరంలోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేశాను. 2009లో ఆ వర్సిటీ ఐదు దశల్లో ఐదురోజుల పాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. ఐదుగురు ప్రొఫెసర్లు వివిధ విభాగాలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. అందు లో కనబరిచిన ప్రతిభతో పాటు బయోకెమిస్ట్రీలో నేను ఎంచుకున్న అంశం భిన్నంగా ఉండడంతో పీహెచ్‌డీకి అవకాశం లభించింది. గతేడాది పీహెచ్డీ పూర్తయి ప్రస్తుతం పోస్టు డాక్టోరల్ఫెలోషిప్ చేస్తున్నాను. బయోకెమిస్ట్రీనే ఎందుకంటే: ఐఐటీ పూర్తి చేసినవారు సాధారణంగా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడం సహజం. కానీ చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం.ఇందుకు సరైన మార్గం ఏమిటా? అని ఆలోచించాను. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులంటే చాలా ఇష్టం. అలా ఆ రెండింటికి అనుబంధంగా ఉండేలా బయోటెక్నాలజీలో ఎంటెక్ చేశాను. బయో కెమిస్ట్రీలో పరిశోధనలకు బోలెడంత అవకాశం ఉంది కాబట్టి నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్లలేదు. సిలియంపై పరిశోధన: జ్ఞానేంద్రియ శక్తులకు మూల కారణమైన కణ నిర్మాణమే సిలియం. ఇది ఓ రకమైన ప్రోటీన్ సముదాయం. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. పీహెచ్‌డీలో భాగంగా ఐదేళ్ల నుంచి మ్యాక్స్ ప్లాంక్ యూనివర్సిటీలో ఇదే అంశంపై పరిశోధనలు చేస్తున్నాను. ఈ దిశగా ఒంటరిగానే ముందుకు వెళుతున్నాను. సైన్స్ మ్యాగజైన్ ప్రశంస ప్రపంచ శాస్త్రవేత్తలకు సంబంధించిన సైన్స్ మ్యాగజైన్లో నా పరిశోధనలపై 2013 జూలై 31న ప్రత్యేక వ్యాసం ప్రచురితమైంది. సిలియం కణ భాగ నిర్మాణం-దాని ప్రొటీన్ సముదాయం, ఐఎఫ్‌టి-81 ప్రొటీన్ నిర్మాణంపై పరిశోధనలు అరుదైనవిగా సైన్స్ మ్యాగజైన్ ప్రశంసించడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఇటలీ, పారిస్, లండన్, స్పెయిన్, స్విట్జర్లాండ్,అమెరికాలలో జరిగిన పలు అంతర్జాతీయ సైన్స్ వేదికలపై నా పరిశోధనలను వివరించాను. అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తల నుంచి ప్రశంసలు లభించాయి. ఫార్చ్యూన్ ఆర్గనైజేషన్ కూడా నా కృషి అత్యంత ప్రధానమైనదిగా అభివర్ణించింది. పక్కా ప్రణాళికే దిక్సూచి: సాధించాలనే సంకల్పానికి పక్కా ప్రణాళిను జతచేస్తే విజయం సాధించగలం. ఎంచుకున్న లక్ష్యం ఏదైనా ఈ విజయ సూత్రాన్ని పాటిస్తే ఎవరైనా సఫలీకృతులవుతారన్నది నా నమ్మకం. దేశానికి పేరు తీసుకురావాలి: స్ట్రక్చరల్ బయాలజీ అండ్ బయో కెమిస్ట్రీ విభాగంలో శాస్త్రవేత్తగా రాణించి మన దేశానికి పేరు తీసుకురావాలన్నదే లక్ష్యం. అకడెమిక్ ప్రొఫైల్ టెన్త్: 499/600 మార్కులు ఇంటర్: 960/1000 మార్కులు ఎంసెట్: 3 వేల ర్యాంకు గేట్ (2006): 115 వ ర్యాంకు సహకారం: సంజీవ్ బర్కుంట, నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్. మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన చిరునామా: సాక్షి భవిత, కేరాఫ్ సాక్షి జర్నలిజం స్కూల్, 8-2-696, 697/75/1, సితార గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్-500008. ఈ-మెయిల్ : sakshieducation@gmail.com -
ప్రీ-సర్వే... గందరగోళం
ముషీరాబాద్ జోన్ బృందం : తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు ఆదిలోనే అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లలో మొదటి రోజు ఇంటింటికీ వెళ్ళి సర్వే ఫారాలను అందించే క్రమంలోనే ఇలాంటి అడ్డంకులు ఎదురైతే 19వ తేదీన సర్వే పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా సర్వే ఫారాలు కావాల్సినన్ని అందించకపోవడం, సకాలంలో రాకపోవడం, ఇంటింటికీ అందించే స్టిక్కర్లు సైతం సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్యూమరేటర్లకు కేటాయించిన అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజరు కావడంతో ఫారాల పంపిణీ నత్తనడకన సాగింది. మొదటిరోజు కేవలం సగం ఫారాలే పంపిణీ చేశారు. గాంధీనగర్‌లో 160మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజర్.. అసోసియేట్ ఎన్యూమరేటర్లు సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఈ రోజు హాజరు కావాల్సిన 160 మంది గైర్హజయ్యారని దీనివల్ల ఇబ్బందులు తప్పవని గాంధీనగర్ డివిజన్ 93-వార్డు సర్వే నోల్ అధికారి సుదర్శన్ తెలిపారు. సమగ్ర సర్వేకు డివిజన్ 93-వార్డులో 56 మంది ఎన్విరేటర్లు, 6గురు క్లస్టర్ ఇన్చార్జిలు ,40 మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు హాజరైనట్లు తెలిపారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో క్లస్టర్లకు, ఎన్యూమరేటర్లకు, అసోసియేట్ ఎన్యూమరేటర్లకు సర్వే బుక్స్‌ను, స్టిక్కర్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని అప్పుడే ఈ సర్వే విజయవంతం అవుతుందన్నారు. ఆరోరా కళాశాలకు చెందిన 160 మంది అసోసియేట్ క్లస్టర్లు రావాల్సి ఉండగా రాలేదన్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసిన వారు ఏలాంటి స్పందన లేదన్నారు. దీనికి రేపు కూడా హజరు కాకపోతే ఇక్కడ నిర్వహించే సర్వే విజయవంతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జీలు, ఎన్విరేటర్లు అనంతరాములు, విజయరావు, సుధాకర్, మంజులసింగ్, సాయినాథ్, రాజేష్, సదానంద్, వేణుగోపాల్‌రావు, పద్మశ్రీ పాల్గొన్నారు. 6 బస్తీలను వదిలేసిన ఎన్యూమరేటర్లు ఈ నెల 19వ తేదీన జరుగనున్న సమగ్ర సర్వేలో భాగంగా ఆదివారం ముషీరాబాద్, భోలక్‌పూర్ డివిజన్లల్లో నోడల్ అధికారి, క్లస్టర్లు, ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. ముషీరాబాద్ డివిజన్ వార్డు నెంబరు -91 విషయానికొస్తే ఆరుగురు క్లస్టర్లు, 58 మంది ఎన్జుమలేటర్లు , 190 మంది అసోసియేట్ ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. అయితే ఉదయం 7 గంటలకు వచ్చిన 58 ఎన్జుమలేటర్లు సహాయకులు సకాలంలో రాకపోవడంతో చాలాసేపు కమ్యూనిటీహాల్‌లోనే కూర్చున్నారు. దాదాపు 11 గంటల తర్వాత ప్రారంభమైనప్పటికి సరిపడా చెక్ లిస్టు పత్రాలు పరిపోకపోవడంతో సహాయకులు నచుడుకుంటూ కమ్యూనిటీహాల్ వద్దకు వచ్చి పత్రాలను తీసుకెళ్లారు. భోలక్‌పూర్‌లో... భోలక్‌పూర్‌లో 19 బస్తీలున్నప్పటికీ బ్యాంక్ కాలనీ, సంజీవయనగర్, టి.అంజయ్యనగర్, భోలక్‌పూర్ హౌస్, వెంకటేశ్వర్‌నగర్ తదితర బస్తీల్లో ఎన్జుమలేటర్లు అసలు తిరగలేదు. డివిజన్లో 67 మంది ఎన్యూమరేటర్లు, 5 గురు క్లస్టర్లు, 200మంది వరకు అసోసియేట్ ఎన్యూమరేటర్లు పాల్గొన్నప్పటికీ చాలా బస్తీల్లో పర్యటించకుండా, చాలా చోట్లల్లో స్టిక్కర్లు అతికించకుండా వదిలేశారు. ముస్లిం ఇళ్లల్లో కుటుంబ సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికి ఒకే పత్రాన్ని ఇచ్చారు. ఉర్దూలో పత్రాలు లేకపోవడంతో ఇబ్బంది పడ్డ ముస్లింలు భోలక్‌పూర్‌లో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు. అయితే చెక్‌లిస్టు పత్రాలు తెలుగు, ఇంగ్లీషులో మాత్రమే ఉన్నాయి. భోలక్‌పూర్‌లోని ముస్లిం బస్తీల్లో పర్యటించి ఎన్యూమరేటర్లు ఇచ్చిన పత్రాలను చూసి చాలా మంది ముస్లింలు ఏమీ రాయాలో తెలియని అయోమయస్థితిలో పడిపోయారు. నోడల్ అధికారిపై కార్పొరేటర్ ఆగ్రహం భోలక్‌పూర్ డివిజన్లో చెక్‌లిస్టు పత్రాల పంపిణీ గందరగోళంగా మారింది. చాలా బస్తీలను వదిలేశారని, తన ఇంటికే ఇంకా రాలేదని స్థానిక కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ అన్నారు. అయితే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న భోలక్‌పూర్‌లో చెక్‌లిస్టు పత్రాలు కేవలం ఇంగ్లీషు, తెలుగులో ఉండటం, ఉర్దూలో లేకపోవడం, ఆరు బస్తీలను వదిలేయడం పై కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ నోడల్ అధికారి అశ్వినికుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూలో పత్రాలు లేవని, ముస్లింల కోసం ఉర్దూలో తెప్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జోనల్ కమిషనర్‌కు మెస్సేజ్ చేశామని కార్పొరేటర్ తెలిపారు. అంతేకాదు పత్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసీ, ఓసీ కులస్తులకే మాత్రం నమోదు చేసే విధంగా ఉందని, ముస్లింల కోసం ‘బీసీ’అని లేదని, బీసీ అని ఉంటే దాని పక్కనే ముస్లిందరం బీసీ (ఈ) అని నమోదు చేసుకునే అవకాశం ఉండేదన్నారు. అడిక్‌మెట్ డివిజన్లోని అడిక్‌మెట్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన ఫారాల పంపిణీ కార్యక్రమానికి ఉదయం 7 గంటలకు అధికారులు వచ్చినప్పటికీ సరిపడా ఫారాలు లేకపోవడంతో కొంతమంది ఎన్యూమరేటర్లు మధ్యాహ్నం రెండు తరువాత పంపిణీ చేయడానికి వెళ్ళారు. ఒక ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్ళను కేటాయించగా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ప్రాంతంలో ఉండటం, ఇంటి నెంబర్లు గుర్తించలేకపోవడంతో కొంతమంది 15 నుంచి 20 ఇళ్ళకు మాత్రమే ఫారాలను పంపిణీ చేశారు. వారికి ఇంటి నెంబర్లు కనుక్కోవడం కష్టతరమైంది. వారు స్థానికులు కాకపోవడం, మహిళా ఉద్యోగులు కావడంతో ఇబ్బందులెదురొన్నారు. ఇంటి నెంబర్ల ప్రకారం ఫారాలను అందజేయడంతో ఒక ఇంటినెంబరుపై ఒక అపార్ట్మెంట్ ఉండటం, అందులో నలబై యాభై ఫ్లాట్లు ఉండటంతో ధరఖాస్తు ఫారాలు లేక పంపిణీ జరగలేదు. పైగా తనకు కేవలం 40 ఇళ్ళనే కేటాయించారని, ఆపై కేటాయించిన వాటిని మాత్రం నేను సర్వే చేయమని ఎన్యూమరేటర్లు మొరాయించారు. అడిక్‌మెట్ డివిజన్లోని మార్క్స్ భవన్, మేడిబావి బస్తీ తదితర ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా నివశిస్తున్నారు. అయితే వారికి తెలుగు ఫారాలు పంపిణీ చేయడంతో వాటిని ఎలా పూర్తి చేయాలో వారికి అర్థం కావడం లేదు. కవాడిగూడ డివిజన్లో కేటాయించిన ఎన్యూమరేటర్లకు సహాయక ఎన్యూమరేటర్లు సరైన సమయానికి రాకపోవడం కారణంగా సుమారు మూడు గంటలకు పైగా ఎన్యూమరేటర్లు ప్రీ-సర్వేను ప్రారంభించడం ఆలస్యమైంది. ఎన్యూమరేటర్లే స్థానికులను సహాయకులుగా అప్పగించిన పనిని పూర్తి చేశారు. ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే కరపత్రాలు, స్టిక్కర్లు సరిపడా అందకపోవడంతో డివిజన్ వ్యాప్తంగా పూర్తి కావాల్సిన ప్రీ-సర్వే పూర్తి కాలేకపోయింది. కరపత్రాలు అధిక భాగం తెలుగులోనే ఉండటంతో ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో మాట్లాడి, చదివే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం పూట ప్రీ-సర్వే పూర్తయిన తరువాత ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరే షన్ కోసం సుమారు రెండు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. -
విశాఖ ఏజెన్సీలో విదేశీ పంట!
కివి పంట సాగుకు అనుకూలం సీసీఎండీ శాస్త్రవేత్తల ప్రణాళికలు చింతపల్లి, న్యూస్‌లైన్ : విశాఖ మన్యానికి మరో అతిథి పంట రాబోతుంది. విదేశాలలో శీతల వాతావరణంలో పం డే కివి మొక్కలను చింతపల్లి మండలం లో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు సీసీఎండీ శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ వేణుగోపాలరావు తెలిపారు. వచ్చే ఏడా ది జనవరిలో లంబసింగి, చింతపల్లి ప్రాంతాలలో కివిని ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు చర్యలు చేపడుతున్నా రు. ఇప్పటికే యాపిల్ సాగును ఇక్కడ ప్రారంభించారు. మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. యాపిల్‌సాగుపై ఆశలు చి గురిస్తున్న తరుణంలో సీసీఎండీ శాస్త్రవేత్తలు మరో అతిథి పంటకు శ్రీకారం చు డుతున్నారు. ఈ పంటల సాగుకు ఇక్కడ వాతావరణం అనుకూలిస్తే కాఫీ సాగులో రాష్ట్రంలోనే తలమానికంగా నిలిచిన విశా ఖ మన్యం మరో కీర్తిశిఖరాన్ని చేరుకుం టుంది. చైనాలో పుట్టిని కివి పంటను ఆ స్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇటలీ వంటి దేశాలలో వాణిజ్యపరంగా పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. ఎన్నో ఔష ధ గుణాలు కలిగిన కివి పండ్లకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. విట మిన్ డి, ఈ, కేలతో పాటు ఖనిజ లవణాలు, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6, వేసవిలో గరిష్టంగా 34 డిగ్రీలకు మించని అటవీ ప్రాంతాలు ఈ కివి పంట సాగుకు అనుకూలంగా ఉం టాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనదేశంలో జమ్మూకాశ్మీర్ పరిశోధ స్థానం ఆధ్వర్యంలో మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తది తర ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా కివి ని సాగు చేస్తున్నారు. కేరళ, హిమాచల్ ప్ర దేశ్‌లలోని ఉద్యాన పరిశోధన కేంద్రాలు సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. మొక్కలను నాటి న 4 లేదా 5 ఏళ్లకు దిగుబడులు ప్రారంభమై ఏడెనిమిదేళ్లకు పూర్తిస్థాయిలో ఫల సాయం ఇస్తాయని శాస్త్రవేత్తలు తెలిపా రు. గత ఏడాది డిసెంబరులో యాపిల్ సాగుకోసం చింతపల్లి, లంబసింగి ప్రాం తాల్లో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసిన సీసీఎండీ శాస్త్రవేత్త డాక్టర్ వీరభద్రరావు కివిని ప్రయోగాత్మకంగా సాగు చేయాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి మొ క్కలను దిగుమతి చేసుకుని ప్రతి ఏడాది జనవరి నుంచి సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. -
కొలువు కొట్టాలె..
మరో దిక్కులేక దరఖాస్తు చేసిన.. నా పేరు పడిదెల వేణుగోపాల్‌రావు. మాది వీణవంక మండలం బేతిగల్. నేను హైదరాబాద్‌లో బీటెక్ (సీఎస్ఈ)పూర్తి చేశాను. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న కష్టపడి నన్ను చదివించిండు. వారి రెక్కల కష్టం చూడలేకపోతున్న. మా ఊళ్లో అందరు ఎప్పుడు సర్కారు నౌకరి చేస్తవు అంటున్నరు. అందుకే గ్రూప్స్, బ్యాంక్ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఓ కోచింగ్ సెంటర్లో ఆరు నెలలు శిక్షణ తీసుకున్న. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న. ఇంతలో వీఆర్వో నోటిఫికేషన్ వెలువడింది. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే కసితో వీఆర్వోకు దరఖాస్తు చేసుకున్న. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నరు. ఇంజినీరింగ్ రంగంలో సరైన అవకాశాలు లేకపోవడంతో.. మరో దిక్కులేక వీఆర్వోకు పోటీపడుతున్న. కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వీఆర్వోకు 72,000, వీఆర్ఏకు 2200 దరఖాస్తులు అందాయన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి భూపరిపాలన ముఖ్య కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13 వరకు 90వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 216 కేంద్రాలను గుర్తించామని, అభ్యర్థులు పెరిగితే అదనంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తుల ఫొటో పరిశీలన ఈనెల 15లోగా పూర్తి చేస్తామన్నారు. అర్హులైన వారందరూ వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామాల్లో దండోరా వేయిస్తామన్నారు. ఈ పరీక్షలకు డీఆర్వో కృష్ణారెడ్డిని సమన్వయ అధికారిగా నియమించామని తెలిపారు. -
సొంతగూటికి చేరనున్న ‘నిట్టు’ !
కామారెడ్డి, న్యూస్‌లైన్ : టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న నిట్టు వేణుగోపాల్‌రావు త్వరలో సొంతగూటికి చేరనున్నారు. రాజకీయ ఎదుగుదలకు కారణమైన బీజేపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకుని ఆ పార్టీ నేతలతో సంప్రదించినట్లు సమాచారం. పార్టీలో చేరికకు పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు తెలిసింది. తెలంగాణ విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించలేని పరిస్థితులు, భవిష్యత్తులో పార్టీకి స్థానం లభించే పరిస్థితులు కానరాకపోవడం తో ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్న బీజేపీలో చేరడమే మంచిదన్న భావనతో ఆయన ఆ పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ కౌన్సిలర్‌గా మూడు పర్యాయాలు పనిచేసిన నిట్టు వేణుగోపాల్‌రావుకు పట్టణంతో పాటు నియోజక వర్గంలో బలమైన క్యాడర్ ఉంది. మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ పిలుపు మేరకు నిట్టు వేణుగోపాల్‌రావు తన అనుచరులతో 2008లో టీడీపీలో చే రారు. సాధారణ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గంప గోవర్ధన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన తరువాత 2011 లో వచ్చిన ఉప ఎన్నికల్లో నిట్టు వేణుగోపాల్‌రావు టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి చెందిన తరువాత ఆయన నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జిగా క్రియాశీలకంగానే పనిచేశారు. తెలంగాణ విషయంలో టీడీపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వేణుగోపాల్‌రావు ఇక లాభం లేదనుకుని ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ కూడా ఉండడం, తాను అదే పార్టీలో పనిచేసిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరడమే ఉత్తమమని భావించి బీజేపీలో చేరడానికి సన్నద్ధ మైనట్టు తెలుస్తోంది. టీడీపీకి మరో దెబ్బ టీడీపీకి నిట్టు గుడ్‌బై చెబితే నియోజక వర్గంలో ఆ పార్టీకి మరో దెబ్బతగిలినట్టేనని భావిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నియోజక వర్గంలో ఆ పార్టీ ఎంతో బలంగా ఉండేది. నాలుగు పర్యాయాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మున్సిపల్‌తో పాటు మండలాల్లోనూ ఆ పార్టీ బలం ఎంతో ఉండేది. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీని వీడిన తరువాత నియోజక వర్గంలో ఆ పార్టీకి భారీ దెబ్బతగిలింది. ఇప్పుడు నిట్టువేణుగోపాల్‌రావు నిష్ర్కమిస్తే మరో దెబ్బతగిలి కోలుకోకపోవచ్చని భావిస్తున్నారు. -
వీరనారి ఐలమ్మ కథ
ప్రీతినిగమ్ టైటిల్ రోల్లో మిరియాల రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరనారి చాకలి ఐలమ్మ’. బోళ్ళ సోమిరెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీజ ఫిలింస్ అధినేత శ్రీ వెంకట్రావు 300 థియేటర్స్‌లో ఈ నెల 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతకోట వేణుగోపాలరావు మాట్లాడుతూ - ‘‘నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలు, దేశ్‌ముఖ్‌లపై పోరు సల్పిన వీరనారి చాకలి ఐలమ్మ కథతో ఈ సినిమా చేశాం. నేటి సమాజం హర్షించే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్, సెంటిమెంట్, లవ్, కామెడీ సమాహారంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: వాసంశెట్టి వెంకటేశ్వరరావు, బోళ్ళ విక్రమాదిత్యారెడ్డి.