'త్వరలో గూడూరు- దుగరాజుపట్నం రైల్వే పనులు' | survey on guduru - durgarajupatnam railway line | Sakshi
Sakshi News home page

'త్వరలో గూడూరు- దుగరాజుపట్నం రైల్వే పనులు'

Published Thu, Jun 30 2016 12:23 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

survey on guduru - durgarajupatnam railway line

నెల్లూరు : గూడూరు - దుగరాజుపట్నం మధ్య రైల్వే లైన్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు విజయవాడ ఏడీఆర్ఎమ్ వేణుగోపాలరావు వెల్లడించారు. గురువారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... విజయవాడ - గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యల తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

నెల్లూరు రైల్వే స్టేషన్లో వైఫై సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సౌకర్యం నెల్లూరు రైల్వే స్టేషన్ కల్పించే అవకాశాలు ఉన్నాయని వేణుగోపాలరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement