ఎల్గూరు, చింతలపల్లి స్టేషన్లలో ఏడీఆర్ఎం తనిఖీలు
- స్టేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రమారాయ్
ఎల్గూర్‌స్టేషన్(సంగెం) : మండలంలోని ఎల్గూర్‌స్టేషన్, చింతలపల్లి రైల్వేస్టేషన్లలో సౌత్ సెంట్రల్ అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రమారాయ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారులో రోడ్డు మార్గం గుండా వచ్చిన ఏడీఆర్ఎం ముందుగా ఎల్గూర్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య, వచ్చిన ఆదాయాల పట్టిక ఖాళీగా వదిలివేశారని ఎప్పటికపుడు రికార్డులు, పట్టికలు అప్డేట్ చేయాలన్నారు.
ప్రయాణి కులంతా టికెట్ తీసుకుని ప్రయాణించేలా చూడాలన్నా రు. ప్లాట్‌ఫాంపై ఉన్న కాస్త నీడనిచ్చే షెడ్డులపై రేకులు లేచిపోయూయని, వాటికి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అనంతరం రైల్వే సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్లను పరిశీలించారు. కొన్ని శిథిలమై నివాస యోగ్యంగా లేవని సిబ్బంది చెప్పడంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. మరమ్మతులు చేయిస్తే నివాసం ఉంటారా అని అడిగితే సౌకర్యాల లేమి వల్ల కుటుంబాలతో ఇక్కడ నివాసం ఉండలేమని తెలిపారు. కోతుల సమస్య ఎక్కువగా ఉందని వాటి వల్ల రైల్వే కాంటాక్టు వైర్ రెండు సార్లు తెగిపోయిందని వెల్లడించారు. స్టేషన్ పరిసరాలను తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు. కార్యక్రమంలో డీఓఎం కుమార్, స్థానిక స్టేషన్ మాస్టర్ నాగేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.