పండగవేళా పనికి రాలేదా!
తొలి టెస్టుకు వేణుకు దక్కని ఆహ్వానం
తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తూ పండుగ వాతావరణంలో సంబరం చేసుకున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వేణుగోపాల రావును మాత్రం విస్మరించింది. టెస్టు ప్రారంభానికి ముందు ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గవాస్కర్, కుంబ్లే, మంజ్రేకర్, శివరామకృష్ణన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్‌లను పిలిచి మెమెంటోలు ఇచ్చి సత్కరించిన ఏసీఏ... ఆంధ్ర నుంచి భారత జట్టుకు ఆడిన వేణును కనీసం మ్యాచ్‌కు ఆహ్వానించలేదు. సాధారణంగా ఏ క్రికెట్ సంఘమైనా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సత్కరించడం ఆనవారుుతీ. ఆంధ్ర తరఫున భారత్‌కు ఆడిన వాళ్ల సంఖ్య కూడా ఎక్కువేం లేదు.
ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కేతో పాటు వేణు మాత్రమే ఆ ఘనత సాధించారు. వేణును కూడా పిలిచి ఓ మెమెంటో ఇచ్చి ఉంటే బాగుండేది. వైజాగ్‌లోనే ఉన్నా వేణుకు ఎలాంటి ఆహ్వానం పంపలేదు. కనీసం ఒక ఫోన్, మెరుుల్ కూడా లేదు. రాష్ట్ర గౌరవం పెంచిన ఓ మాజీ భారత క్రికెటర్‌కు ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏసీఏలోని కొందరు కీలక వ్యక్తులకు వేణు అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేనందు వల్ల ఇలా చేశారని వారి సహచరులే అంటున్నారు. ఏమైనా ఇలాంటి కక్షపూరిత చర్యలు క్రికెట్‌కు ఎంత మాత్రం మంచిది కాదు.