The first Test
-
తొలి టెస్టు పాక్‌దే
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గి రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 64 పరుగుల లక్ష్యాన్ని పాక్ వికెట్ కోల్పోయి ఛేదించింది. హారిస్ సోహైల్ (39 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. గత పర్యటన (2016)లో కూడా పాకిస్తాన్ లార్డ్స్ టెస్టులో విజయం సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 235/6తో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్... మరో ఏడు పరుగులు మాత్రమే చేసి 242 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (67) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు, బెస్ (57) రెండు పరుగులు చేసి వెనుదిరిగారు. పాక్ బౌలర్లలో అమీర్, అబ్బాస్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అబ్బాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్ 1 నుంచి లీడ్స్‌లో ప్రారంభం కానుంది. -
దక్షిణాఫ్రికా 214/5
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (54), బ్రూయిన్ (48) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం బవుమా (48 బ్యాటింగ్), రబడ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. బ్రాడ్, అలీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.3 ఓవర్లలో 458 పరుగులకు ఆలౌటైంది. రూట్ (190) డబుల్ సెంచరీ కోల్పోగా, అలీ (87), బ్రాడ్ (57 నాటౌట్) రాణించారు. -
న్యూజిలాండ్ 177/3
డునెడిన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో రోజు గురువారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (78 బ్యాటింగ్), జీత్ రావల్ ( 52) అర్ధసెంచరీలతో రాణించారు. అంతకు ముందు 229/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (140), బవుమా (64) ఔటైన తర్వాత సఫారీ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ప్రస్తుతం కివీస్ మరో 131 పరుగులు వెనుకబడి ఉంది. -
పండగవేళా పనికి రాలేదా!
తొలి టెస్టుకు వేణుకు దక్కని ఆహ్వానం తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తూ పండుగ వాతావరణంలో సంబరం చేసుకున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వేణుగోపాల రావును మాత్రం విస్మరించింది. టెస్టు ప్రారంభానికి ముందు ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గవాస్కర్, కుంబ్లే, మంజ్రేకర్, శివరామకృష్ణన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్‌లను పిలిచి మెమెంటోలు ఇచ్చి సత్కరించిన ఏసీఏ... ఆంధ్ర నుంచి భారత జట్టుకు ఆడిన వేణును కనీసం మ్యాచ్‌కు ఆహ్వానించలేదు. సాధారణంగా ఏ క్రికెట్ సంఘమైనా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సత్కరించడం ఆనవారుుతీ. ఆంధ్ర తరఫున భారత్‌కు ఆడిన వాళ్ల సంఖ్య కూడా ఎక్కువేం లేదు. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కేతో పాటు వేణు మాత్రమే ఆ ఘనత సాధించారు. వేణును కూడా పిలిచి ఓ మెమెంటో ఇచ్చి ఉంటే బాగుండేది. వైజాగ్‌లోనే ఉన్నా వేణుకు ఎలాంటి ఆహ్వానం పంపలేదు. కనీసం ఒక ఫోన్, మెరుుల్ కూడా లేదు. రాష్ట్ర గౌరవం పెంచిన ఓ మాజీ భారత క్రికెటర్‌కు ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏసీఏలోని కొందరు కీలక వ్యక్తులకు వేణు అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేనందు వల్ల ఇలా చేశారని వారి సహచరులే అంటున్నారు. ఏమైనా ఇలాంటి కక్షపూరిత చర్యలు క్రికెట్‌కు ఎంత మాత్రం మంచిది కాదు. -
కోలుకున్న దక్షిణాఫ్రికా
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు పెర్త్: 21 ఓవర్లలో 105/0... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు ఇది. 70.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్.... ఇది రెండో రోజు ఆస్ట్రేలియా స్కోరు. వార్నర్ (100 బంతుల్లో 97; 16 ఫోర్లు, 1 సిక్సర్) జోరుతో భారీస్కోరు దిశగా సాగిన ఆసీస్... అతను అవుటైన తర్వాత మరో 86 పరుగులు మాత్రమే చేసి మిగిలిన వికెట్లన్నీ సమర్పించుకుంది. దీంతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కోలుకుంది. తొలి వికెట్‌కు వార్నర్, మార్ష్ (63) కలిసి 158 పరుగులు జోడించాక.... ఫిలాండర్ (4/56), మహరాజ్ (3/56) ధాటికి ఆసీస్ విలవిల్లాడింది. దీంతో తొలి ఇన్నింగ్సలో ఆతిథ్య జట్టుకు కేవలం రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఎల్గర్ (46 బ్యాటింగ్), డుమినీ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ కుక్ (12)ను సిడిల్, ఆమ్లా (1)ను హజెల్‌వుడ్ పెవిలియన్ పంపారు. స్టెరుున్ అవుట్ దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెరుున్ గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఆసీస్‌తో టెస్టు రెండో రోజు ఆటలో బౌలింగ్ చేస్తుండగా తన కుడి భుజానికి గాయమైంది. స్కానింగ్‌లో గాయం త్రీవగా ఉన్నట్లు తేలడంతో ఆపరేషన్ అవసరం అని నిర్ణరుుంచారు. -
బంగ్లా ఆశలకు ‘స్టోక్స్’
తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపు చిట్టగాంగ్: సువర్ణావకాశం వచ్చినట్టే వచ్చి బంగ్లాదేశ్ చేతుల్లోంచి చేజారింది. తమ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌పై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసుకునేందుకు కేవలం 33 పరుగులే చేయాల్సిన దశలో.. ఇంగ్లండ్ పేసర్ బెన్ స్టోక్స్ తమకు కావాల్సిన చివరి రెండు వికెట్లును ఒకే ఓవర్లో కూల్చి వారి ఆశలపై నీళ్లుజల్లాడు. 286 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స ఆరంభించిన బంగ్లా ఆట చివరి రోజు సోమవారం తమ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 10 పరుగులను మాత్రమే జత చేసి 81.3 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ అరుు్యంది. దీంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఒంటరి పోరాటంతో జట్టును విజయం అంచుల దగ్గరకు తీసుకువచ్చిన సబ్బీర్ రహమాన్ (102 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)కు చివరి రోజు సహకారం కరువైంది. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బంగ్లా ఇన్నింగ్స సాగగా స్టోక్స్ ఒకే ఓవర్లో తైజుల్ ఇస్లామ్ (16), షఫీయుల్లను పెవిలియన్‌కు చేర్చడంతో ఆతిథ్య జట్టు షాక్‌కు గురైంది. మొత్తం ఆరు వికెట్లు తీసిన స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు ఈనెల 28 నుంచి ఢాకాలో జరుగుతుంది. -
ఇంగ్లండ్‌తో టెస్టు:బంగ్లాదేశ్ 221/5
చిట్టగాంగ్: బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ నిలకడ ప్రదర్శించింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్సలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (78) అర్ధసెంచరీ సాధించగా, ముష్ఫికర్ (48), మహ్ముదుల్లా (38) ఫర్వాలేదనిపించారు. తమీమ్, మహ్ముదుల్లా మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ప్రస్తుతం బంగ్లా తొలి ఇన్నింగ్సలో మరో 72 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజ్‌లో షకీబ్ (31), షఫీయుల్ (0) ఉన్నారు. మొరుున్ అలీకి 2 వికెట్లు దక్కారుు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 258/7తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్సలో 293 పరుగులకు ఆలౌటైంది. -
వెస్టిండీస్‌పై పాక్ గెలుపు
దుబాయ్: పాకిస్తాన్ తమ 400వ టెస్టులో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. డే నైట్ తొలి టెస్టు లో 56 పరుగుల తేడాతో గెలి చింది. డారెన్ బ్రేవో (249 బం తుల్లో 116; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా... జట్టును గట్టెక్కించలేక పోయాడు. 346 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 95/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 109 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆలౌటైంది. రోస్టన్ చేజ్ (35)తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన బ్రేవో... హోల్డర్ (40 నాటౌట్) అండతో సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో ఆమిర్ 3, యాసిర్ షా, నవాజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సలో పాకిస్తాన్ 579/3 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ 357 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సలో పాక్ 123 పరుగులకే ఆలౌటైంది. -
వెస్టిండీస్ విజయలక్ష్యం 346
బిషూకు 8 వికెట్లు దుబాయ్: పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు అనూహ్య మలుపు తిరిగింది. పాక్ తమ రెండో ఇన్నింగ్సలో 31.5 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. సమీ అస్లాం (44) టాప్ స్కోరర్. లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ (8/49) అద్భుత బౌలింగ్‌తో పాక్‌ను కుప్పకూల్చాడు. విండీస్ తరఫున ఇది ఐదో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అంతకుముందు విండీస్ తమ తొలి ఇన్నింగ్సలో 357 పరుగులకు ఆలౌటై పాకిస్తాన్‌కు 222 పరుగుల భారీ ఆధిక్యాన్ని అప్పగించింది. అరుుతే ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వకుండా పాక్ బ్యాటింగ్ కొనసాగించింది. తొలి ఇన్నింగ్స ఆధిక్యం కలుపుకొని విండీస్‌కు 346 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. -
పోరాడుతున్న విండీస్
దుబాయ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు నిలకడగా ఆడుతోంది. మార్లన్ శామ్యూల్స్ (139 బంతుల్లో 76; 13 ఫోర్లు), డ్వేన్ బ్రేవో (222 బంతుల్లో 69 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించడంతో... కడపటి వార్తలందేసరికి విండీస్ తమ తొలి ఇన్నింగ్సలో 88 ఓవర్లలో మూడు వికెట్లకు 246 పరుగులు చేసింది. క్రీజులో బ్రేవోతో పాటు బ్లాక్‌వుడ్ (64 బంతుల్లో 31 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నాడు. యాసిర్ షాకు రెండు వికెట్లు దక్కారుు. -
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయం
బులవాయో: సీన్ విలియమ్స్ (148 బంతుల్లో 119; 21 ఫోర్లు) సెంచరీ సాధించినప్పటికీ... న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే ఓటమిని తప్పించుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బౌలర్లు రాణించడంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఆదివారం 121/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే జట్టు 295 పరుగులకు ఆలౌటైంది. విలియమ్స్, క్రెమెర్ (130 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఏడో వికెట్‌కు 118 పరుగులు జోడించి కివీస్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. విలియమ్స్ 106 బంతుల్లో సెంచరీ సాధించి జింబాబ్వే తరఫున టెస్టుల్లో వేగవంతమైన శతకం కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు, సౌతీ, వాగ్నెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 6 నుంచి జరుగుతుంది. -
చెలరేగిన కోహ్లీ.. తొలిరోజు స్కోరు 302/4
-
ఇషాంత్ శర్మ సిద్ధం
ఉమేశ్ స్థానంలో జట్టులోకి! బెంగళూరు: నిషేధం కారణంగా తొలి టెస్టులో ఆడలేకపోయిన భారత ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ సిరీస్‌లో రెండో టెస్టుకు సన్నద్ధమయ్యాడు. గురువారం జట్టు సభ్యులతో పాటు అతను సుదీర్ఘంగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మొదటి మ్యాచ్ ఆడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో ఇషాంత్ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాంత్‌తో పాటు మరో పేసర్ వరుణ్ ఆరోన్ ఎక్కువ సేపు నెట్స్‌లో పాల్గొనగా...ఉమేశ్ మాత్రం వార్మప్‌కే పరిమితమయ్యాడు. ఉమేశ్‌తో పోలిస్తే మొహాలీలో ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన ఆరోన్, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన ఎల్గర్ వికెట్ తీశాడు. నెట్స్‌లో ఇషాంత్ ఎక్కువ సేపు కోహ్లి, పుజారా, విజయ్‌లకు బౌలింగ్ చేశాడు. -
విజయం దిశగా ఆసీస్
బ్రిస్బేన్: సమష్టిగా రాణిస్తున్న ఆస్ట్రేలియా... న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విజయం దిశగా సాగుతోంది. ఆట నాలుగో రోజు ఆదివారం ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించకుండా ఓవర్‌నైట్ స్కోరు 264/4 వద్దే డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్‌కు 504 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి ఎదురీదుతోంది. రాస్ టేలర్ (20 బ్యాటింగ్), బ్రెండన్ మెకల్లమ్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో నాలుగోరోజు 53 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓపెనర్లు లాథమ్ (29; 3 ఫోర్లు, ఒక సిక్సర్), గుప్టిల్ (23) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఆ తర్వాత గుప్టిల్‌తో కలిసి విలియమ్సన్ (59; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 54 పరుగులు జతచేశారు. క్రీజ్‌లో నిలదొక్కుకుంటున్న దశలో గుప్టిల్, విలియమ్సన్లను ఆసీస్ స్పిన్నర్ లియోన్ అవుట్ చేశాడు.