
కోలుకున్న దక్షిణాఫ్రికా
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు
పెర్త్: 21 ఓవర్లలో 105/0... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు ఇది. 70.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్.... ఇది రెండో రోజు ఆస్ట్రేలియా స్కోరు. వార్నర్ (100 బంతుల్లో 97; 16 ఫోర్లు, 1 సిక్సర్) జోరుతో భారీస్కోరు దిశగా సాగిన ఆసీస్... అతను అవుటైన తర్వాత మరో 86 పరుగులు మాత్రమే చేసి మిగిలిన వికెట్లన్నీ సమర్పించుకుంది. దీంతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కోలుకుంది. తొలి వికెట్‌కు వార్నర్, మార్ష్ (63) కలిసి 158 పరుగులు జోడించాక.... ఫిలాండర్ (4/56), మహరాజ్ (3/56) ధాటికి ఆసీస్ విలవిల్లాడింది. దీంతో తొలి ఇన్నింగ్‌సలో ఆతిథ్య జట్టుకు కేవలం రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఎల్గర్ (46 బ్యాటింగ్), డుమినీ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ కుక్ (12)ను సిడిల్, ఆమ్లా (1)ను హజెల్‌వుడ్ పెవిలియన్ పంపారు.
స్టెరుున్ అవుట్
దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెరుున్ గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఆసీస్‌తో టెస్టు రెండో రోజు ఆటలో బౌలింగ్ చేస్తుండగా తన కుడి భుజానికి గాయమైంది. స్కానింగ్‌లో గాయం త్రీవగా ఉన్నట్లు తేలడంతో ఆపరేషన్ అవసరం అని నిర్ణరుుంచారు.