లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (54), బ్రూయిన్ (48) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం బవుమా (48 బ్యాటింగ్), రబడ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. బ్రాడ్, అలీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.3 ఓవర్లలో 458 పరుగులకు ఆలౌటైంది. రూట్ (190) డబుల్ సెంచరీ కోల్పోగా, అలీ (87), బ్రాడ్ (57 నాటౌట్) రాణించారు.