
ఇషాంత్ శర్మ సిద్ధం
ఉమేశ్ స్థానంలో జట్టులోకి!
బెంగళూరు: నిషేధం కారణంగా తొలి టెస్టులో ఆడలేకపోయిన భారత ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ సిరీస్‌లో రెండో టెస్టుకు సన్నద్ధమయ్యాడు. గురువారం జట్టు సభ్యులతో పాటు అతను సుదీర్ఘంగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మొదటి మ్యాచ్ ఆడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో ఇషాంత్ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇషాంత్‌తో పాటు మరో పేసర్ వరుణ్ ఆరోన్ ఎక్కువ సేపు నెట్స్‌లో పాల్గొనగా...ఉమేశ్ మాత్రం వార్మప్‌కే పరిమితమయ్యాడు. ఉమేశ్‌తో పోలిస్తే మొహాలీలో ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన ఆరోన్, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన ఎల్గర్ వికెట్ తీశాడు. నెట్స్‌లో ఇషాంత్ ఎక్కువ సేపు కోహ్లి, పుజారా, విజయ్‌లకు బౌలింగ్ చేశాడు.