బిషూకు 8 వికెట్లు
దుబాయ్: పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు అనూహ్య మలుపు తిరిగింది. పాక్ తమ రెండో ఇన్నింగ్‌సలో 31.5 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. సమీ అస్లాం (44) టాప్ స్కోరర్. లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ (8/49) అద్భుత బౌలింగ్‌తో పాక్‌ను కుప్పకూల్చాడు.
విండీస్ తరఫున ఇది ఐదో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అంతకుముందు విండీస్ తమ తొలి ఇన్నింగ్‌సలో 357 పరుగులకు ఆలౌటై పాకిస్తాన్‌కు 222 పరుగుల భారీ ఆధిక్యాన్ని అప్పగించింది. అరుుతే ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వకుండా పాక్ బ్యాటింగ్ కొనసాగించింది. తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం కలుపుకొని విండీస్‌కు 346 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.