వెస్టిండీస్‌పై పాక్ గెలుపు | Pakistan went on to win their 400th Test against the West Indies | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌పై పాక్ గెలుపు

Published Tue, Oct 18 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

వెస్టిండీస్‌పై పాక్ గెలుపు

వెస్టిండీస్‌పై పాక్ గెలుపు

దుబాయ్: పాకిస్తాన్ తమ 400వ టెస్టులో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. డే నైట్ తొలి టెస్టు లో 56 పరుగుల తేడాతో గెలి చింది. డారెన్ బ్రేవో (249 బం తుల్లో 116; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా... జట్టును గట్టెక్కించలేక పోయాడు. 346 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 95/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 109 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆలౌటైంది.

రోస్టన్ చేజ్ (35)తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన బ్రేవో... హోల్డర్ (40 నాటౌట్) అండతో సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో ఆమిర్ 3, యాసిర్ షా, నవాజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్‌‌సలో పాకిస్తాన్ 579/3 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ 357 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్‌‌సలో పాక్ 123 పరుగులకే ఆలౌటైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement