చిట్టగాంగ్: బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ నిలకడ ప్రదర్శించింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్‌సలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (78) అర్ధసెంచరీ సాధించగా, ముష్ఫికర్ (48), మహ్ముదుల్లా (38) ఫర్వాలేదనిపించారు.
తమీమ్, మహ్ముదుల్లా మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ప్రస్తుతం బంగ్లా తొలి ఇన్నింగ్‌సలో మరో 72 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజ్‌లో షకీబ్ (31), షఫీయుల్ (0) ఉన్నారు. మొరుున్ అలీకి 2 వికెట్లు దక్కారుు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 258/7తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌సలో 293 పరుగులకు ఆలౌటైంది.