సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ జాగృతి నాయకులతో
టీఆర్‌ఎస్ సర్కారుపై మల్లు రవి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ జాగృతి నాయకులతో కేసులు వేయించిందని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వేణుగోపాలరావు, ఆరేపల్లి మోహన్, పి.శశిధర్‌రెడ్డితో కలసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లా డుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో కోర్టులో కేసులు వేయించారన్నారు.
టీఆర్‌ఎస్ ద్రోహ పూరిత రాజకీయాలను సింగరేణిలో ప్రచారం చేయడానికి 20 మందితో టీపీసీసీ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రవి వెల్లడిం చారు. దీనికి మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి చైర్మన్‌గా, ఐఎన్‌టీయూసీ ఉపా ధ్యక్షుడు జనక్‌ప్రసాద్ కన్వీనర్‌గా, డి.శ్రీధర్ బాబు, బలరాంనాయక్, టి.నాగయ్య, మహేశ్వర్ రెడ్డి, అరవింద్‌రెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నట్టు తెలిపారు.