![Steve Smith Equals Ricky Ponting's Record](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/stevesmith_ricky3.jpg.webp?itok=YRWHuu_Q)
ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కమిందు మెండిస్ క్యాచ్‌ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
పాంటింగ్ 287 ఇన్నింగ్స్‌లలో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ కేవలం 205 ఇన్నింగ్స్‌లలో సరిగ్గా 205 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు.
286 టెస్టు ఇన్నింగ్స్‌లలో ద్రవిడ్.. 210 క్యాచ్‌లను తీసుకున్నాడు. స్మిత్ 14 క్యాచ్‌లను అందుకే రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడుతోంది. 71 ఓవర్లకు శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్(35), రమేష్ మెండిస్(20) ఆచితూచి ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఇప్పటివరకు నాథన్ లియోన్ మూడు వికెట్లు పడగొట్టగా..మిచెల్ స్టార్క్, మథ్యూ కుహ్నమెన్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి టెస్టులో లంకను మట్టికర్పించింది.
ఈ మ్యాచ్‌ను డ్రా ముగించినా చాలు సిరీస్ ఆసీస్ 1-0 సొంతం చేసుకుంటుంది. శ్రీలంక టూర్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆసీస్ జట్టును స్మిత్ ముందుండి నడ్పిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఆస్ట్రేలియా జట్టు పగ్గాలను స్మిత్ చేపట్టే అవకాశముంది.
ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కమ్మిన్స్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జోష్ హెజిల్‌వుడ్, మిచిల్ మార్ష్ గాయం కారణంగా దూరం కాగా.. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ పూర్తిగా వన్డే క్రికెట్‌కే విడ్కోలు పలికాడు.
196TH TEST CATCH STEVE SMITH. 😱
Steve Smith is on the verge of creating another record. This batter is top-class, and he is also a Superman in fielding. He has taken 196 catches so far, and with one more catch, he will break Ponting's record.
Most Test catches for Australia by… pic.twitter.com/fKtqYvYEVs— All Cricket Records (@Cric_records45) February 6, 2025
Comments
Please login to add a commentAdd a comment