యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ నాలుగోరోజు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ వ్యవహారంలో ఆస్ట్రేలియన్ కామెంటేటర్ల వెకిలి నవ్వును సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు. ఈ కామెంటేటర్స్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఉండడం విశేషం.
చదవండి: అసలేం చేస్తున్నావు.. నువ్వు కెప్టెన్‌గా ఉండి ఏం లాభం: రికీ పాంటింగ్
విషయంలోకి వెళితే.. మ్యాచ్ నాలుగోరోజు ఆటలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఒక బంతి రూట్ కాళ్ల మధ్యలో బలంగా తాకింది. దీంతో నొప్పితో బాధపడిన రూట్.. స్టార్క్ తర్వాతి బంతిని లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. కాగా రూట్‌కు నొప్పి ఉండడంతో కాళ్లను కాస్త దూరం పెడుతూ రన్స్ తీశాడు. ఇది గమనించిన ఒక ఆస్ట్రేలియన్ కామెంటేటర్ 'పాపం రూట్ నొప్పితో బాధపడుతున్నాడు.. మ్యాచ్ ఎలాగూ పోతుంది.. రిటైర్డ్‌హర్ట్ అయితే బాగుంటుంది''.. అన్నాడు. ఇది విన్న పాంటింగ్ ఒక్కసారిగా నవ్వేశాడు. అయితే ఆస్ట్రేలియన్ కామెంటేటర్ల ప్రవర్తనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. '' రూట్ నొప్పితో బాధపడుతుంటే మీకు నవ్వులాటగా ఉంది..''.. '' ఒక జట్టు కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా''.. '' ఒక ఆటగాడు నొప్పితో బాధపడుతుంటే మీకు నవ్వెలా వస్తుంది'' అంటూ రెచ్చిపోయారు.
చదవండి: మ్యాచ్ ఆడుతుండగానే చాతిలో నొప్పి... పరుగున ఆసుపత్రికి
Absolute scenes in the commentary box, completely losing it watching Joe Root run 😂 #Ashes pic.twitter.com/0CoJCSPTKD
— 7Cricket (@7Cricket) December 19, 2021
Comments
Please login to add a commentAdd a comment