టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మరో స్థానం మెరుగుపరచుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.
వన్డే వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్ మూడో బంతికి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన కోహ్లి ఓవరాల్‌గా 13705 పరుగుల మార్కు అందుకున్నాడు.
తద్వారా రిక్కీ పాంటింగ్‌ను వెనక్కినెట్టాడు. ఇక ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రచిన్ రవీంద్ర(26.6) బౌలింగ్‌లో సింగిల్ తీసిన కింగ్.. వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ చరిత్రలో తన తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు.
కాగా ఇప్పటి వరకు మూడు వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో ఆడిన కోహ్లి మొత్తం కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2011 పాక్‌తో సెమీస్‌లో 9 పరుగులు... 2015 ఆస్ట్రేలియాతో సెమీస్‌లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్‌తో సెమీస్‌లో 1 పరుగు మాత్రమే చేశాడు. తాజాగా ఈ చెత్త రికార్డు చెరిపేసి హాప్ సెంచరీతో మెరిశాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు
18426 - సచిన్ టెండూల్కర్
14234 - కుమార సంగక్కర
13705* - విరాట్ కోహ్లీ
13704 - రికీ పాంటింగ్
13430 - సనత్ జయసూర్య
Comments
Please login to add a commentAdd a comment