ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్‌పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు.
కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్‌పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది.
భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
చదవండి: IND vs ENG: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.
Comments
Please login to add a commentAdd a comment