
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గురించి ఆ జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అయ్యే అవకాశాలు పంత్‌కు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ''అధిక ఒత్తిడిలో నాయకత్వం వహించే అవకాశాన్ని పంత్ అందిపుచ్చుకున్నాడు. ఐపీఎల్‌ల్ లాంటి మేజర్ టోర్నీలో కెప్టెన్‌గా సక్సెస్ అయిన పంత్.. భవిష్యత్తులో టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు.
టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించినప్పుడు 23-24 ఏళ్లు ఉంటాయి. కట్‌చేస్తే ఇప్పుడు హిట్‌మ్యాన్ ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ గేమ్ స్ట్రాటజీ అదుర్స్. సరిగ్గా అలాంటి స్థితిలోనే పంత్ కూడా ఉన్నాడు. చిన్న వయసులోనే కెప్టెన్ కావడం వల్ల.. ఒత్తిడిని అధిగమించే వీలు ఉంటుంది. రోహిత్ లాగే పంత్ కూడా ఢిల్లీని చాంపియన్స్‌ను చేసే అవకాశం ఉంటుంది. '' అంటూ పేర్కొన్నాడు.
గతేడాది సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో పంత్ తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. తాను కెప్టెన్ అయిన తొలిసారే జట్టును సూపర్‌గా నడిపించాడు. ప్లేఆఫ్స్ వరకు జట్టును తీసుకెళ్లి పంత్ కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. అందుకే ఈసారి మెగావేలానికి ముందు అంతకముందు కెప్టెన్గాఉన్న శ్రేయాస్ అయ్యర్‌ను రిలీజ్ చేసింది. ఇక పంత్ ఈసారి రెగ్యులర్ కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: IPL 2022: 'మా కెప్టెన్‌ది విచిత్ర వైఖరి.. లేటుగా వచ్చారని బస్ నుంచి దింపేశాడు'
IPL 2022: ఒంటరివాడైన రోహిత్.. ప్రస్తుత సీజన్‌లో టైటిల్ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment