AUS Vs SA 2nd Test: David Warner 25th Century Joins Elite Club - Sakshi
Sakshi News home page

David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్‌

Published Tue, Dec 27 2022 8:55 AM | Last Updated on Tue, Dec 27 2022 10:17 AM

Aus Vs SA 2nd Test: David Warner 25th Century Joins Elite Club - Sakshi

డేవిడ్‌ వార్నర్‌ (PC: cricket australia Twitter )

Australia vs South Africa, 2nd Test- David Warner : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సెంచరీతో మెరిశాడు. దాదాపుగా గత మూడేళ్లుగా శతకం సాధించలేక విమర్శలపాలైన అతడు.. ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. అంతేకాదు ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ద్వారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా స్వదేశంలో ఆసీస్‌.. సౌతాఫ్రికాతో తలపడుతోంది. ఇందులో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకున్న వార్నర్‌కు ఇది 100వ టెస్టు. ఈ క్రమంలో మంగళవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా స్టార్‌ బౌలర్‌ కగిసో రబడ బౌలింగ్‌లో ఫోర్‌ బాది 100 పరుగుల మార్కు అందుకున్నాడు వార్నర్‌.

అరుదైన ఘనతలు
ఈ నేపథ్యంలో కెరీర్‌లో 25వ టెస్టు సెంచరీ నమోదు చేసిన వార్నర్‌.. దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. ఆడిన 100వ టెస్టులో శతకం సాధించిన 10వ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేగాక ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు రిక్కీ పాంటింగ్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఎనిమిదో ఆసీస్‌ ప్లేయర్‌గా వార్నర్‌ ఘనత వహించాడు. 

100వ టెస్టులో సెంచరీ సాధించిన బ్యాటర్లు 
►కోలిన్‌ కౌడ్రే- 104- ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా- 1968
►జావేద్‌ మియాందాద్‌- 145- పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా- 1989
►గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌- 149- వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌- 1990
►అలెక్స్‌ స్టెవార్ట్‌- 105- ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌-2000
►ఇంజమాముల్‌ హక్‌ - 184- పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా- 2005

►రిక్కీ పాంటింగ్‌- 120 , 143 నాటౌట్‌- ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా- 2006
►గ్రేమ్‌ స్మిత్‌- 131- సౌతాఫ్రికా వర్సెస్‌ ఇం‍గ్లండ్‌- 2012
►హషీం ఆమ్లా- 134- సౌతాఫ్రికా వర్సెస్‌ శ్రీలంక- 2017
►జో రూట్‌- 218- ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఇండియా- 2021
►డేవిడ్‌ వార్నర్‌- 100 నాటౌట్‌- ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా, 2022

చదవండి: Suryakumar Yadav: సీక్రెట్‌ రివీల్‌ చేసిన సూర్యకుమార్‌.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్‌ నుంచి మారిన తర్వాతే
Ind Vs Ban: టీమిండియా దిగ్గజానికి మాతృ వియోగం.. సంతాపం ప్రకటిస్తూనే.. హ్యాట్సాఫ్‌ చెబుతూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement