Aus Vs SA 2nd Test: David Warner Scores Double Century In 100th Test, Creates Record - Sakshi
Sakshi News home page

David Warner Double Century: 1089 రోజుల తర్వాత ఏకంగా డబుల్‌ సెంచరీ.. తొలి బ్యాటర్‌గా! కానీ అంతలోనే..

Published Tue, Dec 27 2022 11:46 AM | Last Updated on Tue, Dec 27 2022 1:04 PM

Aus Vs SA: David Warner Double Century In 100th Test Records But - Sakshi

డేవిడ్‌ వార్నర్‌ (PC: Cricket Australia/ Video Grab)

Australia vs South Africa, 2nd Test: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టెస్టుల్లో మూడో డబుల్‌ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దాదాపు 1089 రోజుల తర్వాత శతకం బాదిన వార్నర్‌.. వందను డబుల్‌ సెంచరీగా మలచడంలో సఫలమయ్యాడు.

మెల్‌బోర్న్‌ వేదికగా రెండో రోజు ఆటలో రబడ బౌలింగ్‌లో 100 పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనర్‌.. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో 200 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రికార్డులు నమోదు చేసిన వార్నర్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. 

తొలి ఆసీస్‌ బ్యాటర్‌గా
100వ టెస్టులో ద్విశతకం బాదిన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ గతేడాది ఫిబ్రవరిలో ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

రిటైర్డ్‌ హర్ట్‌
ఇక దాదాపుగా మూడేళ్ల తర్వాత ఈ మేరకు అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చిన వార్నర్‌.. పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. అభిమానులకు అభివాదం చేస్తూ ఎగిరి గంతేశాడు. అయితే, ఈ సందర్భంగా వార్నర్‌  కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 253 బంతుల్లో 200 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారంగా మైదానాన్ని వీడాడు.

చదవండి: Babar Azam: పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం! సెహ్వాగ్‌లా అలా!
Suryakumar Yadav: సీక్రెట్‌ రివీల్‌ చేసిన సూర్యకుమార్‌.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్‌ నుంచి మారిన తర్వాతే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement