సెంచరీలతో చెలరేగిన వార్నర్‌, లబుషేన్‌.. దక్షిణాఫ్రికా చిత్తు | Australia thrash South Africa by 123 runs in second ODI | Sakshi
Sakshi News home page

SA vs AUS: సెంచరీలతో చెలరేగిన వార్నర్‌, లబుషేన్‌.. దక్షిణాఫ్రికా చిత్తు

Published Sun, Sep 10 2023 8:45 AM | Last Updated on Sun, Sep 10 2023 9:37 AM

Australia thrash South Africa by 123 runs in second ODI  - Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్‌ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 123 పరగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్‌ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.

కంగూరుల బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌(106), లబుషేన్‌(124) సెంచరీలతో చెలరేగగా.. హెడ్‌(64), జోష్‌ ఇంగ్లీష్‌(50) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ప్రోటీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ షమ్సీ నాలుగు వికెట్లు సాధించగా.. రబాడ రెండు, మార్కో జానెసన్‌ వికెట్‌ సాధించారు.

అనంతరం 393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 41.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశాడు. అదే విధంగా నాథన్‌ ఈల్లీస్‌, అబాట్‌, హార్దే చెరో రెండు వికెట్లు సాధించారు. ప్రోటీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ బావుమా(46) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సెప్టెంబర్‌ 12న జరగనుంది.
చదవండి: Asia Cup 2023: కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement