చరిత్ర సృష్టించిన వార్నర్‌.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు | Australia Vs. South Africa, 2nd ODI: David Warner Breaks Opener Sachin Tendulkar Century Record, Moves To Top Spot In Elite List - Sakshi
Sakshi News home page

SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్‌.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు

Published Sat, Sep 9 2023 7:36 PM | Last Updated on Sat, Sep 9 2023 7:50 PM

David Warner Breaks Opener Sachin Tendulkars Century Record - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎట్టకేలకు తన బ్యాట్‌కు పనిచెప్పాడు. బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో వార్నర్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 

ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 93 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు చేశాడు. వార్నర్‌కు ఇది 20 వన్డే సెంచరీ. ఓవరాల్‌గా డేవిడ్‌ భాయ్‌కు ఇది 46వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం.

చరిత్ర సృష్టించిన వార్నర్‌..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వార్నర్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఓపెనర్‌గా 46 సెంచరీలు వార్నర్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్(45) రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.

అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా 6000 పరుగుల మైలు రాయిని వార్నర్‌ అందుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్న నాలుగో ఓపెనర్‌గా వార్నర్‌ నిలిచాడు. వార్నర్‌ 140 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(121) అగ్రస్ధానంలో ఉన్నాడు.
చదవండి: Asia Cup 2023: 'అతడొక యార్కర్ల కింగ్‌.. వరల్డ్‌ కప్‌ జట్టులో అతడు ఉండాల్సింది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement