WC 2023: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్‌.. ప్రపంచకప్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా | Ind Vs Aus David Warner Breaks Sachin Record Fastest 1000 ODI WC Runs | Sakshi
Sakshi News home page

#indvsaus: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్‌.. ప్రపంచకప్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా

Published Sun, Oct 8 2023 2:45 PM | Last Updated on Sun, Oct 8 2023 8:27 PM

Ind Vs Aus David Warner Breaks Sachin Record Fastest 1000 ODI WC Runs - Sakshi

ICC Cricket World Cup 2023- India vs Australia, 5th Match: టీమిండియాతో మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌, సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట సంయుక్తంగా ఉన్న రి​కార్డును వార్నర్‌ బద్దలు కొట్టాడు.

బుమ్రాకు తొలి వికెట్‌
కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్‌.. ఆతిథ్య భారత జట్టుతో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఆదివారం మొదలైన పోరులో టాస్‌ గెలిచిన కంగారూ టీమ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఈ క్రమంలో మూడో ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ను టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. బూమ్‌ బూమ్‌ బౌలింగ్‌లో మార్ష్‌ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్‌ కోహ్లి పట్టడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

సచిన్‌ రికార్డు బ్రేక్‌.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా (David Warner Record):
ఈ దశలో స్టీవ్‌ స్మిత్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా కొనసాగుతున్న వార్నర్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్‌ బాది వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

గతంలో సచిన్‌, డివిలియర్స్‌ పేరిట
19 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త అధ్యాయానికి తెరతీశాడు. గతంలో సచిన్‌ టెండుల్కర్‌, ఏబీ డివిలియర్స్‌ 20 ఇన్నింగ్స్‌లో ఈ మైల్‌స్టోన్‌కు చేరుకోగా.. విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌, సౌరవ్‌ గంగూలీ 21, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మార్క్‌ వా, సౌతాఫ్రికా మాజీ బ్యాటర్‌ హర్షల్‌ గిబ్స్‌ 22 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.

చదవండి: CWC 2023 India vs Australia: అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement