మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ దిగ్గజమే కాదు.. తన జనరేషన్‌లో అత్యుత్తమ ఫీల్డర్ కూడా. అయితే ఆల్‌టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లలో ఇద్దరు దక్షిణాఫ్రికా దిగ్గజాల పేర్లు వెల్లడించిన పాంటింగ్.. ఒక ఆసీస్ ఆటగాడి పేరును పేర్కొన్నాడు. ట్వీటర్‌లో క్వశ్చన్-ఆన్సర్‌లో భాగంగా ఆల్‌టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా జాంటీ రోడ్స్(దక్షిణాఫ్రికా), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), ఆండ్రూ సైమండ్స్(ఆస్ట్రేలియా)ల పేర్లను పాంటింగ్ సూచించాడు.
వీరు ముగ్గురు తన ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్లని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ ఉన్న పాంటింగ్.. టీమిండియా యువ వికెట్ కీపర్ , ఢిల్లీ జట్టు సభ్యుడైన రిషభ్ పంత్‌ను వెనకేసుకొచ్చాడు. పంత్‌లో విశేషమైన టాలెంట్ ఉందని, అతన్ని త్వరలోనే మళ్లీ భారత క్రికెట్ జట్టులో చూస్తామన్నాడు. అందుకు పెద్దగా సమయం కూడా ఏమీ పట్టదన్నాడు. ఐపీఎల్‌లో పంత్‌తో కలిసి పని చేసిన క్రమంలో అతనిలో విశేషమైన నైపుణ్యాన్ని చూశానని తెలిపాడు. పంత్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పాంటింగ్ పైవిధంగా స్పందించాడు. (ఇక్కడ చదవండి: ‘పంత్.. వారి నోటికి తాళం వేయి’)
Comments
Please login to add a commentAdd a comment