డివిలియర్స్‌ను తీసుకోవాలి! | Jonty Rhodes Comments On South Africa World Cup Squad | Sakshi
Sakshi News home page

డివిలియర్స్‌ను తీసుకోవాలి!

Published Wed, Mar 11 2020 12:34 AM | Last Updated on Wed, Mar 11 2020 12:34 AM

Jonty Rhodes Comments On South Africa World Cup Squad - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ను గెలవాలంటే దక్షిణాఫ్రికా జట్టు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌ అభిప్రాయపడ్డాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేయడం కూడా అందులో ఒకటని అతను అన్నాడు. డివిలియర్స్‌ జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు రెండేళ్లయింది. అయితే రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం అతను పునరామగనం చేసేందుకు సిద్ధమని కూడా ప్రకటించాడు. ‘నేను డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. టి20 ప్రపంచకప్‌ గెలవాలంటే మీరు ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టవద్దు. రాబోయే ఐపీఎల్‌లో అతను ఎలా ఆడతాడనేది ప్రపంచం మొత్తం చూస్తుంది. అయితే ఇటీవల బిగ్‌బాష్‌ లీగ్‌లో అతని ఆట చూస్తే ఏబీ ఎంత అద్భుతమైన ఆటగాడో అర్థమవుతుంది’ అని రోడ్స్‌ వ్యాఖ్యానించాడు. అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న ఆటగాళ్లను కాదని ఒక్కసారిగా డివిలియర్స్‌ను ఎంపిక చేస్తే ఇది దక్షిణాఫ్రికా క్రికెట్‌లో చెడు సాంప్రదాయానికి దారి తీసినట్లు విమర్శలు వస్తాయని కూడా రోడ్స్‌ అన్నాడు. కానీ వరల్డ్‌ కప్‌ కోసం, డివిలియర్స్‌ స్థాయి ఆటగాడి కోసం ఒక సారి ఇలా చేసినా తప్పేమీ కాదని కూడా అతను విశ్లేషించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement